వీరిని మాధవాచార్యులు అనికూడా పిలుస్తారు. కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కోస్తా ప్రాంతంలో జన్మించిన మాధవాచార్యుల వారు యుక్త వయస్సులోనే *ఏక దండి* సాంప్రదాయంలో సన్యాసాశ్రమం స్వీకరించారు.
ఆది శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతాన్ని, రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ *తత్త్వవాదం* ( వాస్తవిక కోణం లో భగవంతుని గురించిన వాద ప్రతి వాదములు) రచించారు.
మాఘ మాస శుక్ల పక్ష నవమి రోజు వీరు మోక్షం పొందారు అని భక్తుల విశ్వాసం.
ఈరోజు ద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే వారు మధ్వాచార్యుల వారి ఆరాధనలు చేస్తారు.
ఉడిపి లోని అనంతేశ్వర్ దేవాలయంలో ఈ రోజు ప్రత్యేక పూజలు,రథయాత్ర జరుగుతాయి.
ఈరోజు *మహానంద నవమి*. దుర్గాదేవిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు.
పురాణాల ప్రకారం దుర్గాదేవి కి తొమ్మిది ప్రత్యేక అంశలు,రూపాలు ఉన్నాయి.
అవి *చంద్రఘంట, శైలపుత్రీ, కాళరాత్రి, స్కంద మాత, బ్రహ్మచారిణి, సిద్దిదాయిని, కూష్మాండ, కాత్యాయిని, మహాగౌరి*. ఈ రోజు దుర్గా దేవికి పూజ చేయడం వలన నవదుర్గలకు పూజ చేసినంత ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఈరోజు భక్తులు ముఖ్యం గా మహిళలు దుష్ట శక్తుల నుండి రక్షణ పొందటానికి కావాల్సిన శక్తి సామర్థ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, దుర్గా దేవి పూజ చేస్తారు.
ఈరోజు తో *శ్యామలా నవరాత్రులు* పూర్తి అవుతాయి.
ఈరోజు *రోహిణీ వ్రతం*. జైన స్త్రీలు ప్రతి రోహిణి నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉంటారు.
దుర్గా దేవి స్మరణం తో......సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..
No comments:
Post a Comment