Adsense

Monday, February 14, 2022

కాకాసుర వృత్తాంతము...!!



ఈ వృత్తాంతము సుందరకాండ సర్గ 38లోనూ[1] , 67లోనూ[2] , రెండుచోట్ల కనిపిస్తుంది.

 సర్గ 38లో తన భుజముల మీద వచ్చుటకు నిరాకరించిన సీతను ఉద్దేశించి హనుమంతుడు ఆనవాలు అడుగగా, ఆవిడ ఈ వృత్తాంతమును రామునికి గుర్తుచేయమని చెప్పి, చూడామణి కూడా ఇచ్చింది.

 సర్గ 67లో హనుమంతుడు కిష్కింధలో రాముని కలిసినపుడు ఈ వృత్తాంతమును గుర్తు చేస్తాడు. 

ఇంక మీ ప్రశ్నకి వస్తే రెండు సర్గలలో కూడా వర్ణన ఇలాగే ఉంటుంది -

తాం తు దృష్ట్వా మహాబాహో రాదితాం చ స్తనాన్తరే |...💐🙏

కాకాసుర వృత్తాంతము :

 రామాయణము
 అరణ్యకాండలొ జరిగినా వాల్మీకి హర్షి సుందరకాండములో 
ప్రస్తుతిస్తారు. 

 సీతమ్మ దర్శనం హనుమంతుడు 
పొందాక సీతమ్మను ఏదైన అభిజ్ఞానము చెప్పమని కొరుకొన్నప్పుడు ఒక అభిజ్ఞానముగా కాకాసుర వృత్తంతాన్ని చెబుతుంది.

కాకాసురినిపై గడ్డిని మంత్రించి అస్త్రం వలె ప్రయోగిస్తున్న రాముడు 

ఆ కాకి ఇంద్రుడి కుమారుడైన కాకాసురుడు. దేవతలు పంపిన కారణముగా భూలోకము నకు వెళ్ళి తన కళ్ళు రాముని బ్రహ్మాస్త్రానికి సమర్పించుకొంటాడు.

        🙏జరిగిన కథ 🙏

సీత రామచంద్రులు చిత్రకూట పర్వతం పై అరణ్యవాసము జరుపుతున్నప్పుడు జరిగిన విషయము.

 ఒకరోజు చిత్రకూట పర్వతానికి ప్రక్కన ఉన్న చిన్న చిన్న పర్వతాలమీద విహరిస్తు ఈశాన్య పర్వతము మీద ఉన్న కొలనులో రాముడు స్నానము చేసి తడి బట్టలతో రాముడు సీత వద్దకు వస్తాడు.

 అప్పుడు సీతమ్మ తల్లి అక్కడ  ఒరుగులు (వడియాలు) ఎండపెట్టుకొంటు ఉంటుంది. 

ఆ సమయములొ ఒక కాకి అక్కడకు వచ్చి ఆ వడియాలు తినడడం ప్రాంభిస్తుంది. 

అది చూసిన సీత ఆ కాకి మీద ఒక మట్టి బెడ్డ విసురుతుంది. అప్పుడు ఆ కాకి సీతమ్మ తల్లి వక్షస్థలము పై వ్రాలి ముక్కుతో సీతమ్మ వక్షస్థలము నుండి మాంసపు ముక్క కరచు కొంటుంది.

 దానితో సీతమ్మ చాలా బాధ పడుతున్న సమయములొ ఆమె పట్టు చీర సడలి వడ్డాణము కూడా వదులౌతుంది. చేతికందిన ఆ వడ్డాణాన్ని తీసి ఆ కాకిని కొట్ట బోతుంది.

అదిచూసి రాముడు సీత ఒక కాకిని కొట్టడానికి మెలనూలు (వడ్డణం) తీసి దానిమీద విసురుతావేమిటి అని నవ్వుతాడు.

 ఆ తరువాత కాకి వెళ్ళిపోతుంది, కొంత సమయం పోయాక సీతమ్మ రాముడి ఒడిలొ నిద్ర పోతుంది,

 ఇంకొద్ది సమయము పోయాక సీతమ్మ తల్లి నిద్ర లేచి రాముడిని ఒడిలో పడుకొబెట్టు కొంటుంది. 

సీతమ్మ రాముడి ఒడిలొ నిద్ర పోతున్నంత సమయం కాకి రాదు, సీత ఒడిలో రాముడు నిద్రకు ఉపక్రమించిన వేంటనే వచ్చి అమ్మవారి వక్షస్థలము పై మళ్ళి వ్రాలి ముక్కురతో మాంసాన్ని గ్రుచ్చుకొని తింటుంది.

 దానితో సీతమ్మ వక్షస్థలము నుండి రక్తము కారుతుండగా ఆ రక్తపు తడి
 శ్రీరాముడు నుదురు మీద పడుతుంది.

శ్రీరాముడు వేంటనే నిద్ర లేచి ఎవరురా ఐదు తలల పాముతో ఆట అడుతున్నారు అని ప్రక్కన ఉన్న దర్భను తీసి బ్రహ్మాస్త్రాన్ని అబిమంత్రీంచి ఆ కాకి మీద వేస్తాడు. 

ఆ కాకి అక్కడ నుండి అన్ని లోకాలకు పరుగు పెట్టుతుంది. ముల్లోలాలలో ఆ కాకిని రక్షించేవారు కనపడరు.


చివరకు గతిలేకా ఆ కాకి వచ్చి రాముడిని వేడుకొంటుంది. అప్పుడు రాముడు సీత శాంతించడం చూసి బ్రహ్మాస్త్రానికి ఏదో ఒకటి సమర్పించవలెనని పలుకగా తన కుడీ నేత్రాన్ని ఇచ్చేయదం వల్ల ఆ కాకికి చూపు పోతపోతుంది.....సేకరణ.

No comments:

Post a Comment