Adsense

Monday, February 7, 2022

ఐశ్వర్యము అంటే..

 


 ఐశ్వర్యం అంటే అందరు ఏమనుకుంటారంటే ధనము ,సంపదలు ,ఆస్తులు ,అంతస్తులు అని అనుకుంటారు కాని  నిజమయిన ఐశ్వర్యము అంటే ...

ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆరోగ్యముతో జీవిస్తూ ఉంటాడో ,

ఏ మనిషైతే శరీరము విడిచే నాటికి  సంపూర్ణమైన ఆనందముతో జీవిస్తూ ఉంటాడో ,

ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటాడో  అతడే ఐశ్వర్య వంతుడు. దీనినే సంపూర్ణ ఐశ్వర్యం అంటారు.

అంతే గాని చనిపోయేంతవరకు సంపాదిస్తూ పోతూ, సంపాదించిందంతా వైద్యాలయానికి పోయడం కాదు ఐశ్వర్యమంటే ,

చనిపోయేంతవరకు ఇంటిలో గాని వీధిలోగాని ఘర్షణలతో జీవించడం కాదు ఐశ్వర్యమంటే ,

చనిపోయేంతవరకు సంపాదించిన ధనము వల్ల శత్రువులను, ఈర్షపరులను ఎవరు నాకు హాని తలపెడతారు అని భయముతో జీవించడము కాదు ఐశ్వర్యమంటే ,

చనిపోయేంతవరకు నీ నిజస్వరూపాన్ని తెలుసుకొకుండా భగవంతునికోసం గుడి గోపురం తిరగడం, తీర్ధయాత్రలు చేయడం కాదు ఐశ్వర్యమంటే ,

వీటినన్న్నిటిని జయించినవాడే ఐశ్వర్య వంతుడు. శరీరము ఎవరైనా విడిచిపెట్టవలసినదే ఎవరైనా సరే ......

పుట్టినవాడు మరణించక తప్పదు ,మరణించినవారు మరలా పుట్టక మానరు.

ఆత్మ అవినాశి ఆత్మకు చావు లేదు,పుట్టుకా లేదు.కాని వున్నదంతా ఈ శరీరానికే.

అది తెలియక నేను ,నేను అంటూ వ్యామోహానికి గురై బాధపడుతున్నారు అందరు.

ఈ జీవితంలో ఏవిదంగా ఆరోగ్యవంతునిగా జీవించాలో, ఏ విధంగా ఆనందంగా జీవించాలో, ఏవిధంగా ఐశ్వర్య వంతునిగా జీవించాలో, ఏవిధంగా ఆధ్యాత్మికంగా జ్ఞానంతో జీవించాలో తెలియజేసేదే యోగ సాధన.

ఎవరు శరీరంతో వున్నంతవరకు ఏవిధంగానూ లోటుతో శరీరాన్ని వదలరాదు..

No comments:

Post a Comment