Adsense

Saturday, February 12, 2022

ఐశ్వర్యం వృద్ధి చెందాలంటే..


*ప్రతి ఇంట్లో మూడు  చోట్ల లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి ఉంటుంది. 

*మొదటిది ఇంట్లో ఉన్న తులసి చెట్టు. అందులో తులసి చెట్టు ఎండిపోకుండా ఇంట్లో ఉండాలి. ఎండిపోతున్నదని అనుమానం వస్తే దానిని మార్చాలి. 

*రెండవది బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి. బ్రాహ్మణులకు సమారాధన చేయడం అని, వేదం వినడం అని ఇలాంటివి చేస్తూ ఉండాలి. మహాత్ములు వచ్చినపుడు తన ఇంటిని విడిదిగా ఇవ్వాలి. అటువంటివారిని సేవిస్తూ ఉండాలి.  

*మూడవది లక్ష్మీదేవి స్థిరమైన నివాసమును ఎవరు అపెక్షేస్తున్నారో అటువంటి వాళ్లకు తగినంత కారణం లేకుండా పగటిపూట అదే పనిగా నిద్రపోయే తత్వం ఉండకూడదు. 

*ఐశ్వర్యం ప్రబలంగా నిలబడడానికి ఈ మూడు ఎక్కడ ఉంటాయో తాను అక్కడ ఉంటానని లక్ష్మీదేవి దేవీభాగవతం లో చెప్పింది.

*లక్ష్మిని మాత్రమే కోరుకుని శ్రీమన్నారాయనుని తిరస్కరిస్తే లక్ష్మి ఉండదు.

*ఆవిడ మహా పతివ్రత. ఆయనకు చోటులేని చోట ఆవిడ ఎలా ఉంటుంది? 
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే!

No comments: