ఈ రోజు 11వ మహర్షి ఉద్దాలక మహర్షి చరిత్ర తెలుసుకుందాము
🌿 పూర్వం మహాతపస్వి , మహాతేజస్వి , మహాస్వాధ్యాయవేత్త అయిన ఉద్దాలక మహర్షుండేవాడు .
🌸 అతడు మంత్రద్రష్ట , మంత్రవేత్త , మంత్రమహితుడు . ఉద్దాలకుడి ఈ గురువు ధౌమ్యుడు .
🌿 ఉద్దాలకుడి భార్య కూడా ఆయనలాగే ధర్మకార్యాలు చేస్తూ అనుకూలంగా వుండేది . వారిద్దరికీ ఒక కూతురు కలిగింది . ఆమె పేరు సుజాత .
🌸 ఉద్దాలకుడు సుజాతని ఏకపాదుడనే తపస్వికిచ్చి పెళ్ళిచేశాడు . ఆమెకి అష్టావక్రుడనే కొడుకు కలిగాడు .
🌿కానీ , తర్కశాస్త్రానికి సంబంధించిన వాదనలో ఓడిపోయి , ఏకపాదుడు కూపశిక్షను అనుభవించసాగాడు .
🌸అదే సమయంలో ఉద్దాలకుడికి కూడా ఒక కొడుకు కలిగాడు . అతని పేరు శ్వేతకేతుడు . అష్టావక్రుడు , శ్వేతకేతుడు ఒకే వయస్సు వాళ్ళవడంవల్ల సుజాత దగ్గరే పెరిగారు .
🌿 ఉద్దాలకుడే తండ్రి అనీ , శ్వేతకేతుడు అన్న అనీ అష్టావక్రుడనుకునేవాడు . ఉద్దాలకుడి సమస్త వేదశాస్త్రాలు నేర్చుకున్నారు .
🌸ఆ పిల్లలిద్దరు ఉద్దాలకుడినే గురువుగా ధ్యానించి సర్వవేదశాస్త్రాలు నేర్చుకుని పౌర్ణమి చంద్రుడిలా వెలిగిపోయారు .
🌿 ఒకసారి అష్టావక్రుడు ఉద్దాలకుడి ఒళ్ళో కూర్చుంటే చూసి నీ తండ్రి ఒళ్ళో కూర్చో అన్నాడు శ్వేతకేతుడు .
🌸అష్టావక్రుడి తండ్రి ఏకపాదుడెక్కడున్నాడో ఉద్దాలకుడి వల్ల విని కూపంలో ఉన్న ఏకపాదుడిని శ్వేతకేతుడు , అష్టావక్రుడు వెళ్ళి విడిపించారు .
🌿ఉద్దాలకుడు తనకొడుకు శ్వేతకేతుడికి పెళ్ళిచెయ్యాలని నిర్ణయించుకున్నాడు . శ్వేతకేతుణ్ణి పిలిచి విషయం చెప్పాడు ఉద్దాలకుడు .
🌸తగిన అమ్మాయి దొరకగానే చేసుకుంటానన్నాడు శ్వేతకేతుడు .
ఆకాలంలో మహాతపస్వి , వేదవేత్త , శాస్త్రవిజ్ఞుడు ఆచారమతుడు ,
🌿 ధర్మజ్ఞుడు అయిన దేవల మహర్షికి సువర్చలనే పేరుగల కూతురుంది . సువర్చలకి అందచందాలే కాకుండా విద్య వినయం , జ్ఞానం అన్నీ వున్నాయి .
🌸దేవల మహర్షి సువర్చలని ఎవరికిచ్చి చెయ్యాలా అని అనుకుంటుంటే తండ్రితో మునికుమారులని పిలిపించు , నేనే ఎన్నుకుంటానంది సువర్చల . దేవల మహర్షి ముని కుమారులని అందర్నీ పిలిపించాడు .
🌿 అందులో ఆమె వేసిన ప్రశ్నలకి శ్వేతకేతుడు సరయిన సమాధానాలిచ్చాడు . ఉద్దాలకుడు సవర్చలతో శ్వేతకేతుడి పెళ్ళి జరిపించి వాళ్ళిద్దర్ని వేరే ఆశ్రమంలోకి పంపించాడు .
🌸ఆనాటి ఆచార ప్రకారం స్త్రీలు కూడా చాలామంది మగవాళ్ళలాగే సంతానం కోసం ఎవరితో కావాలంటే వాళ్ళతో వెళ్లి గడుపుతూండేవాళ్ళు .
🌿ఒకనాడు ఒక ముసలి బ్రహ్మణుడు తనకు ఒక కొడుకు కావాలని ఉద్దాలకుడి భార్యని అడిగాడు .
🌸అది విన్న శ్వేతకేతుడికి కోపం వచ్చి ఆచారాన్ని నిషేధిస్తూ స్త్రీలు ఎప్పుడూ పరపురుషుడి దగ్గరకి వెళ్ళకూడదని శాసించాడు .
🌿 అప్పటినించీ పాతివ్రత్యం అనేది పవిత్రమైన ధర్మంగా భావించడం మొదలయ్యింది .
🌸ఉద్దాలకుడు తనకంటే గొప్పవాడు . సరస్వతీదేవినే చూడగలిగినవాడు అయిన కొడుకుని పొంది ఇంకా గొప్పవాడయ్యాడు .
🌿ఇదండి ఉద్దాలక మహర్షి చరిత్ర
No comments:
Post a Comment