మన మహర్షుల చరిత్ర..
18 వ మహర్షి కణ్వ మహర్షి గురించి తెలుసుకుందాం
🌿కణ్వ మహర్షి కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టాడు . ఈయనని ' మునికుల చూడామణి ' అంటారు .
🌸అంటే మునులందరిలో గొప్పవాడు అని అర్ధం . ఈయన చిన్నప్పటి నుంచి తపోనిష్ఠలో ఉండి జీవితమంతా బ్రహ్మచారిగానే
🌿డిపాడు . సామవేద మంత్రాలు బాగా తెలిసినవాడు . కణ్వ మహర్షి ఆశ్రమం మాలినీ నదీ తీరంలో ఉండేది .
🌸 ఇంద్రుడి ఖాండవవనం , కుబేరుడి చైత్రరథం ఎంత గొప్పగా ఉంటాయో కణ్వుడి ఆశ్రమం అంత గొప్పగా ఉండేది .
🌿ఆయన ఆశ్రమంలో ఎప్పుడూ వేదఘోష వినిపిస్తూ ఉండేది . అగ్నిహోత్రాలు నిత్యము ఉండేవి .
🌸 శాస్త్ర ప్రవచనాలతో , వేదార్థ మీమాంస గోష్ఠిలో జరిగే వాదనలతో , గొప్ప తపస్సంపన్నులతో దివ్యాశ్రమంలా ఉండేది .
🌿అక్కడ పక్షులు గానం చేస్తుంటే ఏనుగులు చెట్ల నీడల్లో నిలబడి వినేవి . మహర్షులు పెట్టే పిండాలు తినడానికి ఎలుకలు పిల్లులు స్నేహంతో వచ్చి వంతులు వేసుకుని తినేవి .
🌸ఆ ప్రాంతానికి వచ్చిన రాజర్షులు కానీ , బ్రహ్మర్షులు కానీ కణ్వ మహర్షి దగ్గర ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్ళేవారుకాదు .
అంత పవితమయింది కణ్వాశ్రమం .
🌿 ఒకనాడు కణ్వ మహర్షి మాలినీ నదిలో స్నానం చెయ్యడానికి వెళ్ళినపుడు ఒక చిన్నపిల్ల ఏడుపు వినిపించింది .
🌸 కణ్వుడు ఆ ఏడుపు వినిపించిన వైపు వెళ్ళి అక్కడ తామరాకుల మీద పడుకోబెట్టి ఉన్న చంటి పిల్లని చూశాడు .
🌿ఇంతలో ఆకాశవాణి “ మహర్షి ! ఈ బాలిక మేనక విశ్వామిత్రులకి పుట్టిన అమ్మాయి .
🌸ఈ అమ్మాయికి శకుంతల అని పేరు పెట్టి నువ్వు పెంచు . ఆ అమ్మాయికి పుట్టిన అబ్బాయి గొప్ప చక్రవర్తి అవుతాడు ” అని చెప్పింది
🌿 కణ్వమహర్షి ఆ అమ్మాయిని తీసుకొనిపోయి తనే తల్లి తండ్రి అయి పెంచారు.
🌸శకుంతలని ముద్దుగా పెంచుతూ కణ్వ మహర్షి అన్ని విద్యలు నేర్పించాడు . శకుంతల పెద్దదయి తండ్రి పూజకి కావలసిన పువ్వులు కోసి సహాయపడేది .
🌿ఒకనాడు దుష్యంత మహారాజు వేటకోసం వచ్చి అలసిపోయి కణ్వాశ్రమానికి వచ్చాడు .
🌸అక్కడ శకుంతలని చూసి ఆమె గురించి తెలుసుకుని పెళ్ళి చేసుకోమని అడిగాడు . శకుంతల కూడా దుష్యంతుణ్ణి చూసి ఇష్టపడింది .
🌿కణ్వ మహర్షి లేని ఆ సమయంలో దుష్యంతుడు శకుంతలని గాంధర్వ పద్ధతిని పెళ్ళిచేసుకుని చాలాకాలం అక్కడే ఉండిపోయాడు .
🌸దుష్యంతుడు తనని సకలలాంఛానాలతో అతని రాజ్యానికి తీసుకుని వెళ్తాడని కలలలో తేలిపోతుంటుంది శకుంతల.
🌿అదే మైమరపులో ఆశ్రమంలోకి అడుగుపెట్టిన దుర్వాస మహర్షిని సరిగా గమనించుకోదు.
🌸 శకుంతల పరధ్యానానికి కోపగించుకున్న దుర్వాసుడు, దుష్యంతుడు ఆమెను మర్చిపోతాడంటూ శపిస్తాడు.
🌿ఆ తరువాతి కాలంలో శాపవిమోచనం కారణంగా శకుంతలా దుష్యంతులు కలుసుకోవడం జరుగుతుంది.
🌸 వారిరువురికీ జన్మించిన భరతుడు దుష్యంతుని రాజ్యానికి వారసుడు అవుతాదు
🌿కణ్వుడు ఈ తీరున ఒక వంశం ఏర్పడేందుకే కాదు, మరో వంశం నిర్మూలం అయ్యేందుకు కూడా కారణం అయ్యాడు.
🌸అదెలాగంటే- కణ్వుడు ఒకనాడు విశ్వామిత్రుడు, నారదుడు వంటి మహర్షులతో కలిసి కృష్ణుని పాలనలో ఉన్న ద్వారకకు చేరుకున్నారు. ఈ మహర్షులను చూసిన యాదవ కుర్రకారుకి వారిని కాసేపు ఆటపట్టాలని అనిపించింది.
🌿వెంటనే సాంబుడు అనే యాదవుని దుస్తులలో ఒక ముసలం (రోకలి) పుడుతుందనీ, ఆ సంఘటన తరువాత యాదవ వంశం నిర్మూలం అవుతుందనీ శపిస్తాడు కణ్వుడు.
🌸శాపవశాన నిజంగానే సాంబుడి కడుపున ముసలం జన్మిస్తుంది. ఆ సంఘటన తరువాత యాదవులంతా తాగి ఒకరితో ఒకరు కలియబడి చంపుకుంటారు.
🌿అదే సమయంలో కృష్ణుడు సైతం ఒక వేటగాడి బాణం తగిలి తన తనువుని చాలించాలని నిర్ణయించుకుంటాడు.
🌸కణ్వ మహర్షి తప్పసు నుండి తిరిగి వచ్చి జరిగినది తెలిసికొని శకుంతలని దీవించి నీకేం కావాలో అడగమన్నాడు .
🌿పుట్టబోయే కుమారుడ వంశోద్ధారకుడు , ఆయురారోగ్య ఐశ్వర్య బలాలతో ఉండాలని
🌸తన మనస్సు ఎప్పుడు ధర్మకార్యాలు చెయ్యడం గురించే ఆలోచించాలని కోరింది శకుంతల.
🌿శకుంతలకి కొడుకు పుట్టిన తర్వాత కణ్వ మహర్షి ఆ పిల్లవాడికి భరతుడు అని పేరు పెట్టాడు .
🌸 భరతుడు క్రూరజంతువుల్ని తన బలంతో చంపేస్తుండేవాడు . అందుకే అతనికి ' సర్వదమనుడు ' అని పేరు కూడా ఉంది .
🌿కణ్వ మహర్షి భరతుణ్ణి చూసి యువరాజ్య పట్టాభిషేకానికి తగినవాడని ఆలోచించి శకుంతలని పిలిచి దుష్యంత మహారాజు దగ్గరకి పంపుతానని చెప్పాడు .
🌸ఆశ్రమంలో ఉన్న అందరికి భోజనాలు పెట్టించి శకుంతలాభరతుల్ని కొంతమంది శిష్యుల్ని తోడుగా ఇచ్చి దుష్యంతుడి దగ్గరికి పంపాడు .
🌿 దుష్యంతుడు మొదట శకుంతల నాకు తెలియదు అని అన్నాడు . కాని , ఆకాశవాణి చెప్పిన విషయాలు విని జరిగినది గుర్తుకువచ్చి శకుంతలా , భరతుల్ని ఆదరించాడు . '
🌸 ధర్మశాస్త్రము ' అనేది కణ్వ మహర్షి రచించిన గ్రంథము .ఇదండీ
🌿కణ్వ మహర్షి చరిత్ర
No comments:
Post a Comment