6వ మహర్షి ఆస్తీక మహర్షి చరిత్ర తెలుసుకుందాం.
🌿 బ్రహ్మవైవర్త పురాణం ఆధారంగా కశ్యప మహర్షి యొక్క మానస పుత్రిక వాసుకి సోదరి జరత్కారువు అనే మానసాదేవి
🌸 ఆస్తీక నాగదోష నివారణ స్తోత్రం పఠిస్తే సమస్త నాగ దోషాలు, కష్టాలు, బాధలు మబ్బు తెప్పల్లా తేలిపోతాయని పురాణ వచనం.
🌿 నాగుల పీడ నివారణ ఇలా.. ఆస్తీక ఆస్తీక ఆస్తీక అని అనుకోండి.. పాములు మిమ్మల్ని ఏమీ చేయవు’ అని ఈనాటికీ పెద్దలు అంటూ ఉండటం కనిపిస్తుంటుంది.
🌸ఈ ఆస్తీక మంత్రం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటీ?
ఆస్తీక అనే పేరు వినగానే భయంకరమైన విషసర్పాలు సహితం ఏమీ చేయకుండా సౌమ్యంగా పక్కకు ఎందుకు తొలగిపోతాయి ?
🌿ఈ విషయాల్ని తెలుసుకోవాలి అంటే...
ఒక మహర్షి చరిత్ర తెలియాలి.
ఆయనే " ఆస్తీక మహర్షి "
🌸 పూర్వకాలంలో జరత్కారుడు అనే మహర్షి ఉండేవాడు . ఆయన ఘోటక బ్రహ్మాచారి .
🌿ఆయన ఆన్ని తీర్థాల్లోను స్నానం చేస్తూ , అన్ని పుణ్యక్షేత్రాలు చూస్తూ తిరుగుతున్నాడు .
🌸 ఒకనాడు తలక్రిందుగ ఒక చెట్టుకొమ్మని పట్టుకుని వ్రేలాడుతున్న ఋషుల్ని చూసి ,
🌿 వారికి కింద ఉన్న లోయల్ని చూసి , ఈ స్థితిలో ఉన్న మీకు నేను ఏమైనా సాయం చెయ్యగలనా ? అనడిగాడు .
🌸నాయనా ! నువ్వు చెయ్యగల సాయం ఏమీ లేదు . మేమే బాగా తపస్సు చేసిన వాళ్ళం .
🌿ఏం కావాలన్నా మేమే చేసుకోగలం .
మేము మీ పితృదేవతలం...నువ్వు పెళ్ళి చేసుకుని సంతానం పొందితేనే
🌸 మాకు పుణ్యలోకాలకి వెళ్ళే అర్హత వస్తుంది . మా తపస్సు ఇక్కడ ఉపయోగం లేదు .
🌿 జరత్కారుడు చాలా బాధపడి వాళ్ళు తన తల్లిదండ్రులే అని తెలుసుకుని క్షమించమని అడిగి
🌸 త్వరలో మీరు చెప్పినట్లే చేసి మీకు విముక్తి కలిగిస్తానని చెప్పాడు .
తన పేరు కలిసిన పేరు కల అమ్మాయినే పెళ్ళి చేసుకుని
🌿 సంతానం కలగగానే వదిలేస్తానని తల్లిదండ్రులకి చెప్పి బయలుదేరాడు జరత్కారుడు .
🌸 ఒకసారి వినత కదృవ అనే నాగ వనితలు పందెం వేసుకుని , ఓడిపోయిన వాళ్ళు రెండో వాళ్ళకి దాసిగా ఉండాలి అనుకున్నారు .
🌿వినత ఓడిపోయింది . కదృవకి దాసిగా వినతని పంపించడానికి నాగపుత్రులు ఒప్పుకోలేదు .
🌸అప్పుడు కదృవ జనమేజయ మహారాజు సర్పయాగం చేసినప్పుడు సర్పాలన్ని చచ్చిపోవాలని శపించింది .
🌿 వాసుకి మొదలయిన వాళ్ళంతా సర్పయాగం ఆపించాలి అని ఆలోచిస్తున్నారు .
🌸 వాసుకి చెల్లెలయిన జరత్కారువుకి అస్తీకుడు అనే వాడు పుట్టి సర్పయాగాన్ని ఆపగలడని బ్రహ్మ దేవతలు కలిసి మాట్లాడుకుంటుంటే విన్నాను అన్నాడు నాగుడు .
🌿 జరత్కారుడు బిక్షకోసం వచ్చినపుడు వాసుకి తన చెల్లెలు జరత్కారువును ఇచ్చి పెళ్లి చేశారు.
🌸 కొంతకాలానికి జరత్కారువు గర్భవతి అయింది .
ఆ ఇద్దరికి కలిగిన కుమారుడే "ఆస్తిక మహర్షి "
🌿 అస్తీక మహర్షి చ్యవన మహర్షి కొడుకైన ప్రమతి దగ్గర వేదవేదాంగాలు నేర్చుకుని గొప్ప జ్ఞాని అయ్యాడు .
🌸 బ్రహ్మవరం కారణంగా జరత్కారవు అనే ఒకే పేరున్న ఇద్దరు దంపతులకు జన్మించిన బాలుడి వల్ల సర్పవినాశనం ఆగిపోతుంది.
🌿అలా జన్మించింది తానే కనుక తన వల్లనే సర్పయాగం ఆగిపోయి సర్పజాతికి మేలు కలగాలి.
🌸 ఈ విషయాన్ని మననం చేసుకుంటూ తన మేనమామ వాసుకికి ధైర్యం చెప్పి సర్పయాగాన్ని ఆపటానికి సంకల్పించుకొని ముందుకు నడిచాడు ఆస్తీకుడు.
🌿 జనమేజయ మహారాజు తండ్రి పరీక్షిత్తుని పాము కరిచింది . పరీక్షిత్తు పాము కాటుకి చనిపోయాడు .
🌸 జనమేజయుడు పాములన్నిటి మీద కోపం వచ్చి సర్పయాగం మొదలు పెట్టి పాములన్నిటినీ చంపడం మొదలుపెట్టాడు .
🌿అప్పుడు అస్తీకుడు జనమేజయమహారాజు దగ్గరకి వెళ్ళి మహారాజుని , యాగానికి అక్కడికి వచ్చిన వాళ్ళందర్నీ స్తోత్రం చేశాడు .
🌸 జనమేజయుడు సంతోషించి అస్తీకుడిని ఏం కావాలో కోరుకోమన్నాడు . అస్తీకుడు సర్పయాగం ఆపి నాగుల్ని రక్షించమన్నాడు .
🌿 తక్షకుడు తన ప్రధాన శత్రువే అయినా జనమేజయడు ఇచ్చిన మాటకు కట్టుబడి
🌸అక్కడున్న రుత్విక్కులు అందరి సూచన మేరకు ఆస్తీకుడు అడిగిన వరాన్ని ఇచ్చి యాగాన్ని ఆపాడు.
🌿 మిగిలిన సర్పాలన్నీ అక్కడికి వచ్చి ఆస్తీకుడికి కృతజ్ఞతలు చెప్పి తమను కష్టాల నుంచి గట్టెక్కించినందుకు
🌸ఏం కావాలంటే అవి చేస్తామని ఏం కావాలో చెప్పమని పదేపదే అడిగాయి.
మానవులను అదే పనిగా హింసించారాదు అని అడిగాడు.
🌿 ఆస్తీకుడి పేరును ఎవరైనా స్తుతి చేసినపుడు వారిని విడిచిపోతామని, తొలగిపోని సర్పం నశిస్తుందని
🌸 నాగులన్నీ ఆస్తీకుడికి మాట ఇచ్చాయి.
ఇలా ఆస్తీకుడు తన మాతృవంశం వారిని రక్షించి వారివల్ల లోకోపకారకమైన తగిన వరం పొందాడు.
🌿 ఆ కారణంవల్లే దోవలో వెళ్లేటప్పుడు పాములుంటాయని భయం ఉన్నప్పుడు ఆస్తీక.. ఆస్తీక.. ఆస్తీక.. అని పెద్దగా అనుకోమని పెద్దలు చెబుతుంటారు.
🌸ఈ విధంగా అస్తీక మహర్షి జరత్కారుని తల్లిదండ్రులు పుణ్యలోకాలకి వెళ్ళడానికి ,
🌿నాగుల్ని రక్షించడానికి కారకుడవడమే కాకుండా . గొప్ప తపస్సంపన్నుడు అయ్యాడు . మన అస్తీక మహర్షి నాగలోకాన్ని ఉద్దరించాడన్న మాట ..స్వస్తి.
No comments:
Post a Comment