Adsense

Sunday, September 27, 2020

తలకోన. Talakona y


తలకోన చిత్తూరు జిల్లా యెర్రావారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు.

ఇది తిరుపతికి 45 కి.మీ దూరంలో శేషాచల కొండల పర్వతశ్రేణుల మధ్యలో ఉంది. ఇక్కడ 60 మీటర్ల ఎత్తు నుండి పడుతున్న జలపాతాలు చాలా అకర్షణీయంగా ఉంటాయి. ఓషధీ లక్షణాలు కల మొక్కలు అనేకం ఉన్నాయి. తలకోనలో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి పున్నమి అతిథి గృహం ఉంది.

విశేషాలు:

తలకోన శేషాచల కొండల వరుసలో తల భాగంలో వున్నందున దీన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు మూడు వందల అడుగులు. ఈ జలపాత దృశ్యం నయనానంద కరంగా వుంటుంది. ఇక్కడ చేరగానే మొదట మనం కనుగొనేది సిద్దేశ్వరాలయము, అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు. అలయానికి అతిసమీపముగా వాగు ఒకటి ఎల్లపుడూ ప్రవహిస్తూంటుంది. ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి. సిద్దేశ్వరాలయము నుండి కొంత ముందుకు సాగిన నెలకోన, దిగువ ఝరి, ఎగువ ఝరి లకు వళ్ళవచ్చు. ఈ మూడింటికి చాల ప్రాముఖ్యత ఉంది. నెలకోన అన్నది దట్టమైన కొండల మధ్య ఉంది. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఈ కొలను యొక్క లోతు ఎవరూ కనుగొనలేదు. అంత సాహసము ఎవరూ చేయలేదు. ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక అంశము రెండు కొండల నడుమ ఉండే పెద్ద గుండు రాయి. ఇది ఎప్పడు మీద పడుతందో అని భయపడక మానరు, చూసిన వారు.

తలకోనకు ఎలా వెళ్ళాలి?

పీలేరు నుంచి 50 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది.తిరుపతి బస్ స్టాండ్ నుండి ప్రతి రోజు ఉదయం 7 గంటలకు నేరుగా తలకోనకు బస్సు సౌకర్యం ఉంది, మళ్ళి తలకోన నుండి తిరుపతికి సాయింత్రం 4 గంటలకు ఇదే బస్సు ఉంది.ఇదికాక తిరుపతి నుండి పీలేరు వెళ్ళే బస్ ఎక్కి భాకరాపేట దిగవలెను. అక్కడి నుంచి 26 కిలోమీటర్లు ఆటో ద్వారా నెరబైలు మార్గంలో ప్రయాణం చేస్తే తలకోన చేరుకోవచ్చు. భాకరాపేట నుంచి తలకోనకు నిత్యం ప్రయివేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం 4:30 తర్వాత జలపాతానికి అనుమతి లేదు. భాకరాపేట బస్ స్టాండ్ నుండి రోజుకు 2 బస్సులు మాత్రమే ఉన్నాయి.

తలకోనల వసతి:

తలకోనలో టీటీడీ ఆధ్వర్యంలో రెండు అతిథి గృహాలు ఉన్నాయి. ఇందులో 12 గదులు ఉన్నాయి. అడ్వాన్స్ బుకిం గ్ కోసం 08584-272425 నంబర్‌కు ఫోన్ చేసి రిజర్వేషన్ చేసుకోవచ్చు. డీలక్స్ గది అద్దె రూ. 500. అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వసతి గృహాలు, డార్మెంటరీలు ఉన్నా యి. 4 లాట్లు ఉండగా ఇందులో 6 గదులతో పాటు డార్మెంటరీ, సామూహిక బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే శాకాహార, మాంసాహార భోజన సౌకర్యాన్ని అట వీశాఖ అందిస్తోంది.

రామలక్ష్మణుల వృక్షాలు:

తలకోన శిరోద్రోణి తీర్థం (వాటర్ పాల్స్, ఝరి) కి వెళ్లే దారిలో రామలక్ష్మణుల మామిడి వృక్షాలు ఉన్నాయి. ఒకే పొడవుతో ఉన్న ఈ వృక్షాలను భక్తులు రామలక్ష్మణ వృక్షాలుగా పిలుస్తారు. వారు ఈ పర్వతాలపై సంచరించారనడానికి గుర్తుగా ఈ వృక్షాలు ఉన్నట్లు భక్తుల నమ్మకం.

నెలకోన:

తలకొన జలపాతం ఉన్న కొండ క్రింద ప్రాంతంలో మరొక జలపాతం ఉంది.దాని పేరు నెలకొన, ఇక్కడ దొంగల బండి లాంటి తెలుగు సినిమా షూటింగ్ కూడా జరిగింది.

No comments: