"ల్యాండ్ లైన్, మొబైల్ సేవల కోసం తగినన్ని సంఖ్యలు అందుబాటులో ఉండేలా చూడడం"పై 'ట్రాయ్' చేసిన సిఫారసుల మేరకు, టెలీ కమ్యూనికేషన్స్ విభాగం ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది:
1. జనవరి 15 నుంచి మొబైల్‌కు కాల్ చేయడానికి సంబంధిత సంఖ్యకు ముందు సున్నా (0) జోడించాలి
2. ల్యాండ్ లైన్ నుంచి ల్యాండ్ లైన్‌కు, మొబైల్ నుంచి ల్యాండ్ లైన్‌కు డయల్ చేసే విధానంలో ఎలాంటి మార్పులు లేవు. 3. ల్యాండ్ లైన్ నుంచి మొబైల్‌కు సున్నా జోడించకుండా కాల్ చేసినప్పుడు, సున్నా జోడించమనే ప్రకటన వినిపిస్తుంది.
4. ల్యాండ్ లైన్ చందాదారులందరికీ 0 డయలింగ్ సౌకర్యం అందుతుంది.
5. దీనివల్ల దాదాపు 2539 మిలియన్ల సంఖ్యా శ్రేణులు కొత్తగా అందుబాటులోకి వస్తాయని అంచనా. భవిష్యత్ అవసరాల దృష్ట్యా తగినన్ని సంఖ్యా వనరులను సృష్టించడానికి ఇది దోహదం చేస్తుంది.
6. తగినన్ని సంఖ్యా వనరుల కారణంగా కొత్త నంబర్లతో ఎక్కువ సంఖ్యలో మొబైల్ కనెక్షన్లు ఇవ్వడానికి వీలవుతుంది
7. చందాదారుల ఇబ్బందులను తగ్గించడానికి, కొత్త సంఖ్యల సృష్టికి పైన పేర్కొన్న మార్పులు తీసుకొచ్చారు.
No comments:
Post a Comment