Adsense

Sunday, November 22, 2020

సప్త మాతృకలు

ప్రాచీన కాలానికి చెందిన కొన్ని క్షేత్రాలను దర్శించినప్పుడు, ఒకే శిలా ఫలకంపై చెక్కబడినవిగా .. ఒకే వరుసలో కొలువుదీరినవిగా ఏడు అమ్మవారి రూపాలు దర్శనమిస్తుంటాయి .. అవే 'సప్త మాతృకలు'. ఈ శక్తి స్వరూపాల ఆవిర్భావం వెనుక, ఒక ఆసక్తికరమైన కథ వుంది. పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు తనకి గల వరబలం చేత గర్వించి, దేవతలను .. మహర్షులను అనేక విధాలుగా హింసిస్తుంటాడు. దాంతో దేవతల ప్రార్ధన మేరకు ఆ అసురుడిని సంహరించడానికి పరమ శివుడు రంగంలోకి దిగుతాడు.


సప్త మాతృకలు
సప్త మాతృకలు :- బ్రహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి.

సర్వ దేవతలూ శక్తిస్వరూపాలేనని స్పష్టం చేసే గాధలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి.

పరాశక్తి " సప్తమాతృకలు" గా అవతరించింది. బ్రహ్మ ,విష్ణు, శివాది దేవతల శక్తులే సప్తమాతృకలు.

బ్రహ్మాణి : ఈ మాతృమూర్తి బ్రహ్మశక్తిస్వరూపిణి. బ్రహ్మవలే హంస వాహిని, అక్షమాల, కమండలం ధరించిన శక్తి.

మాహేశ్వరి : శివుని శక్తి. శివునివలే వృషభం పై కూర్చుని త్రిశూలాన్ని, వరదముద్రని ధరించి, నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత.

కౌమారి : కుమారస్వామి శక్తి. శక్తి ( బల్లెం) హస్త. మయూర వాహనారూఢ

వైష్ణవి: విష్ణు శక్తి . శ్రీ మహా విష్ణు వలే గరుడవాహనాన్ని అధిరోహించి, చేతులతో శంఖ చక్ర గదా శార్ఙ్గ,ఖడ్గ ఆయుధాలు ధరించిన మాత.

వారాహి : హరి అవతారమైన యఙ్ఞవరాహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి.

నారసిమ్హి: విష్ణువు ధరించిన నరసిమ్హావతార శక్తి, సిమ్హముఖంతో,నరదేహంతో, అగ్నిమయకాంతితో దివ్యంగా ప్రకాశించే జనని.

ఐంద్రీ : ఇంద్ర శక్తి, ఐరావతం పై కూర్చుని వజ్రాయుధాన్ని ధరించిన సహస్ర నయన ఈ జగదంబ

ఇవి సప్తమాతృకలు. అంటే సర్వదేవతలు అమ్మ రూపాలే.జగదంబ రాక్షస సమ్హారం చేస్తూ ఉండగా, సప్తమాతృకలు ఆవిర్భవించి ఆమేకు సహకరించాయి.

ఇలా సర్వంశక్తిమయం అనే భావన బలపడాలి. ఆ భావనే భక్తి. ఆ భక్తే ముక్తి అవుతుంది. అదే మానవ జీవిత సార్థకత. ఆ అమ్మ అనుగ్రహమే అసలైన మానవ జీవిత సార్థకథ. ఆ అమ్మ అనుగ్రహమే అసలైన వరం. ఆ వరమే అందరం అర్ధించాలి. అందుకు చిత్తశుద్ధితో ఆ జగదంబని శరణు వేడాలి.

అయితే అంధకాసురుడు నుంచి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుంచి ఒక్కో అసురుడు పుడుతుంటాడు. ఆ రక్తపు బొట్లు కిందపడకుండా చూడటం కోసం బ్రహ్మాది దేవతలు తమ అంశాలతో ఏడు శక్తి స్వరూపాలను సృష్టించి .. శివుడికి సాయంగా పంపించారు. ఆ శక్తి స్వరూపాలే .. సప్త మాతృకలు. ఆ శక్తి స్వరూపాలు .. అంధకాసురుడి రక్తపు బొట్లు కిందపడకుండా చేయడంతో, శివుడు ఆ అసురిడిని సంహరించాడు. అలా లోక కల్యాణం కోసమే సప్త మాతృకల ఆవిర్భావం జరిగింది.               



No comments: