జమ్మూ : కాశ్మీర్‌ను వణికిస్తున్న ‘చిల్లై కలన్’
01:34 PM Dec 27, 2020 | uday
Souce: prabhanews
కాశ్మీర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థాయికి పడిపోయాయి. శనివారం కూడా ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థాయికి దిగువనే నమోదయ్యాయి. రాబోయే వారం రోజుల్లో సాధారణ వర్ష పాతంతోపాటు మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 12న మంచు కురిసినప్పటి నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించారు. శ్రీనగర్‌లోనూ కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 3.7 డిగ్రీలుగా ఉన్నదని అధికారులు చెప్పారు. దక్షిణ కాశ్మీర్లోని పర్యాటక ప్రదేశం పహల్గామ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 4.5 డిగ్రీలుగా ఉన్నది. గత రాత్రి నమోదైన మైనస్ 5.9 డిగ్రీల కంటే ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగైంది. ఉత్తర కాశ్మీర్లోని గుల్మార్గ్‌లోని ప్రసిద్ధ స్కై రిసార్ట్ ప్రాంతంలో అతి తక్కువగా మైనస్ 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖాజీగండ్‌లో మైనస్ 4 డిగ్రీలు, కుప్వారాలో మైనస్ 3.6 డిగ్రీలు, కొకెర్‌నాగ్‌లో మైనస్ 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతిశీతల పరిస్థితి చిల్లై కలన్’ కొనసాగుతుండటమే తీవ్ర చలి పరిస్థితులకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. డిసెంబర్ 21న ప్రారంభమైన ఈ చిల్లై కలన్ జనవరి 31 వరకు 40 రోజులపాటు కొనసాగుతుందని చెప్పారు.
No comments:
Post a Comment