Posted Date:- Feb 02, 2021

ప్రస్తుతం కేంద్ర స్థాయిలో యోగా విద్యకు నియంత్రణ లేదు. అయితే, మోరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ (ఎండిఎన్ఐవై), న్యూఢిల్లీ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయంప్రతిపత్తి సంస్థ, వివిధ యోగా విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి:

  ఎండిఎన్ఐవై, న్యూ ఢిల్లీ నిర్వహిస్తున్న యోగ విద్యా కార్యక్రమాల వివరాలు  

క్రమ సంఖ్య

కార్యక్రమం/కోర్సు 

కార్యక్రమం/కోర్సు వ్యవధి 

1.

ఎం.ఎస్సీ(యోగా)

2 సంవత్సరాలు 

2.

బి.ఎస్సీ(యోగా)

3 సంవత్సరాలు

3.

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యోగా థెరపీ ఫర్ మెడికోస్, పారా మెడికోస్ (పీజీడివైటిఎంపి )

1 సంవత్సరం 

4.

యోగిక్ సైన్సెస్ లో డిప్లొమా (డివైఎస్సీ)

1 సంవత్సరం 

5.

యోగ ఫర్ వెల్నెస్ లో సర్టిఫికెట్ కోర్సు 

6 నెలలు 

6.

యోగా ఫర్ ప్రోటోకాల్ ఇన్స్ట్రక్టర్ లో సర్టిఫికెట్ కోర్సు(సీసీవైపిఐ)

3 నెలలు 

7.

యోగా సైన్స్ ఫర్ సర్టిఫికెట్ కోర్సు 

4 నెలలు 

 

ఇంకా, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సిఎఫ్), 2005 యోగాను ఆరోగ్యం మరియు శారీరక విద్యలో అంతర్భాగంగా సిఫార్సు చేసింది. ఆరోగ్యం మరియు శారీరక విద్య అనేది 1 వ తరగతి నుండి పదవ తరగతి వరకు తప్పనిసరి విషయం మరియు పదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఐచ్ఛికం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) ఇప్పటికే ఆరోగ్యం మరియు శారీరక విద్యపై ఇంటిగ్రేటెడ్ సిలబీని మొదటి తరగతి నుండి పదవ తరగతి వరకు అభివృద్ధి చేసింది.

కేంద్ర సహాయ మంత్రి (ఆయుర్వేద, యోగా, ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి), శ్రీ కిరెన్ రిజిజు (అదనపు ఛార్జ్) ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

 

 

*****

Release Id :-1694738