Adsense

Friday, March 12, 2021

ఆధ్యాత్మికం..భక్తి సమాచారం

ఏదో వెళ్ళాం, మొక్కుకొన్నాం, అంతేతప్ప దేవుడు, శిల్పాలు ఎలా వున్నాయో  గమనించామా !
................................................

దేవాలయంలోని విగ్రహాలు, శిల్పాలు అనేక భంగిమ (Postures) లలో, వివిధ రకాలైన ఆభరణాలతో అలరారుతూవుంటాయి. అవి ఏమిటో ఎలా వుంటాయో పరీశీలనగా చూస్తేతప్ప అర్థంకావు. అవేమిటో గమనిద్దాం.

(1) అంకుశం > Elephant Goad (2)బాణ > బాణం 
(3)దండ > దండం > Staff or stick (4)గద > Club (5) హల > నాగలి (6)ఖడ్గ > కత్తి(7) ఖేటక > డాలు (8)ముసలం > రోకలి (9)నాగ > నాగబంధం (10) నాగపాశం > గుండ్రంగా పాములా చుట్టిన పాశం (11) పరశు > గండ్రగొడ్డలి (12) పాశ  > పాశం (13) శక్తి > ఈటె (14) శూల > బల్లెం (15) త్రిశూల > త్రిశూలం (16) వజ్ర > పిడుగు
(17)వజ్రాయుధ (18) అక్షమాల > ముత్యాల/పూసలదండ (11) బిక్షాపాత్ర
(20)చక్రం

(21)శంఖు (22)చామరం > వింజామర (23)ఢమరం
(24) దంత > ఏనుగు దంతం
(25)గంట (26)జట > వెంట్రుకల ముడి (27)కలశం (28) కపాలం (29) ఖట్వాంగం > పొడవాటి ఎముక చివర పుర్రె వున్న ఆయుధం (30) కుక్కుటం > కోడి (31) కుంతలం > మొనవాడిగానున్న ఈటెలాంటి ఆయుధం (32) మయూర ఫించం (33) మోదకం > ఉండ్రాళ్ళు (34) మృగం > జింక (35) నాగం (36) నీలోత్పల > నీలిపద్మం
(37)పద్మం (38)పుస్తకం > తాటాకుల గ్రంథం (39) స్రువ > గరిటెలాంటిది (40) ఉత్పల > పద్మం

(41) వేణువు (42) వీణ (43) ఆర్ధోరుక > లాగు, చిన్న సల్లడం (44) చెన్నవీర > కంఠం నుండి వక్షస్థలంపై వేలాడు ఆభరణం (45) గ్రైవేక > కంఠాభరణం
(46) జటామకుటం > వెంట్రుకలు పొరలు పొరలుగా వున్నట్లు వుండే కిరీటం (47)కంకణం (48) కపాలమాల (49) కరండమకుటం > బోర్లించిన పాడుగాటి పాత్రలా వున్న కిరీటం (50)కీర్తిమకుటం > స్థూపాకారంలా వున్న కిరీటం
(51) కుచబంధ > వక్షస్థలంలోనున్న బంధం
(52)కుండల > చెవి ఆభరణం (Ear Rings) (53) మకరకుండల > మొసలి ఆకారంలో నున్న చెవి ఆభరణాలు ( Rings) (54)మేఖల > వడ్డాణం (55) మంజీర > భుజకీర్తులు
(56)పాదవలయ > గండపెండెరం/కాలిగజ్జెలు (57) పాదుకలు (58) పత్రకుండల > ఆకును పోలిన చెవి ఆభరణం (Rings) (59) పూర్ణోరుక >  నడుము నుండి పాదాల వరకు ధరించు వస్త్ర విశేషం > pant (60) రత్నకుండల > రత్నాల చెవి వలయాభరణం Ear Rings

(61) శంఖపత్రకుండల > శంఖం ఆకారం గల చెవి ఆభరణం > Conch  ear rings (62) సర్పకుండలం (63) సింహలలాటం > సింహం ముఖం (64) ఉదరబంధం > కడుపును నడుమును చుట్టి వుండే బంధం > Belt (65) యజ్ఞోపవీతం (66) ఆలింగనం (67) భుజంగలలిత > కుడికాలుతో మోకాలుపై కూర్చోవడం, ఎడమ కాలును భూమికి సమాంతరంగా వుంచడం, బాణప్రయోగ సమయంలో విలుకాడు ఇలా ఒక భంగిమలో కూర్చుంటాడు.(68) భుజంగాత్రసన >  పైదానివలనే, కాకపోతే ఈ భంగిమలో ఎడమకాలితో మోకాలుపై కూర్చుంటాడు.(69) చతుర > పీఠం,ఆసనంపై కూర్చోవడం,అర్ధపద్మాసనం > కుడికాలు  కిందికి జారవిడచి, ఎడమకాలు యొక్క బొటన వ్రేలు అసనానికి తగిలిలే కూర్చోవడం (70) ద్విభంగ > విగ్రహశరీరం రెండువంపులు తిరిగివుండటం (71) సమభాగ > విగ్రహాశరీరంలో వంపులు లేకుండా నిటారుగా వుండటం (72) సుఖాసన > శరీరంలో ఏలాంటి వంపులులేకుండా సుఖంగా కూర్చునివుండటం (73) త్రిభంగ > విగ్రహం నిలబడివున్నపుడు అందులో మూడు వంపులు ఉండటం (75) ఉర్ధ్వజాను > ఒక కాలుతో నిలబడి మరోకాలును  కిరీటంనకు సమాంతరంగా పైకి లేపివుండటం (76) ఉత్కిటాసన > అరికాల్లు దగ్గరగాచేర్చుకొని కూర్చోవడం (77) వ్యస్తాత్యపాద > మోకాళ్ళను అడ్డంగా చేర్చుకొని కూర్చోవడం (78) మధ్యమ > మధ్యవేలు (79) అభయముద్ర > కుడి అరచేతిని ముందుకు విశాలంగా పైకి చూపడం (80) వరదముద్ర > ఎడమ అరచేతిని పూర్తిగా తెరచి కిందకు చూపడం.
-సేకరణ

No comments: