Adsense

Wednesday, March 31, 2021

కొన్ని తెలుగు సంగతులు

కొన్ని తెలుగు సంగతులు ; 
- సేకరణ
తెల్లకాటుక: 
కళ్లకు నల్లకాటుక వాడితే.. మొకానికి తెల్లపాడర్ ( ఇప్పటి లానే వాడే వారు చాలా శతాబ్దాల కిందట తెలుగువాళ్లు.దానిని 'తెల్లకాటుక ' గా పిలుచుకునేవారు.

నీరుకావి బట్టలు : 
బట్టలు సాధారణంగా చాకళ్లకు వేస్తే వారు ఊరి చెరువులో ఉతికి ఆరబెట్టి సాయం వేళకు తెచ్చే ఆచారం ఉండేది మా చిన్నతనంలో ఊళ్లల్లో, కానీ పెద్దవారు వారి మడి కోసం వాడుకొనే బట్టలను ఉమ్మడి చాకళ్లకు వేసేవారు కాదు. తామే ఇంటి పట్టని తడిపి ఆరాచెట్టుకునే వాళ్లు అట్లాంటి బట్టలను ' నీరుకావి'  బట్టలుగా పిల్చకోవడం అచారం. 

అయిదవతనం : '
ఆమె అయిదవతనంపె పోగొట్టుకున్నది అని రచనల్లో రచయితలు/ రచయిత్రులు వాడటం చూస్తుంటాం. దానర్థం ఆమె మాంగల్యం కొల్పోయిందని. శబ్దరత్నాకారం పరిశీలిస్తే ఈ పదానికి ' అయిదు వెన్నెలలు' కలది అని వ్యుత్పత్తి కనపడుతుంది. అది సరి కాదు. సంస్కృతంలోని ' అవిధవా' ( విధవ కాకపోవడం ) అనే శబ్దం నుంచి పుట్టుకొచ్చిన పదంగా భావించడం సబబు .

మజ్జిగలలో రకాలు : 
పెరుగులో నీరు పోసి చిలగ్గోడితే మజ్జిగ అవుతుందని అందరికీ తెలుసు . అయితే ఆ మజ్జిగలన్నీ ఒకేలా ఉండవు. అవి 5 రకాలు, 
ఒక వంతు నీరు చేరిస్తే         - మథితం 
రెండువంతులు చేరిస్తే         - ఉదశ్విత్తు 
నాలుగు వంతులు అయితే  - తక్రం 
అన్నీ నీళ్ల వంతే అయితే       - ఛచ్ఛికా 
అసలు  నీరే  లేని మజ్జిగ - ఘోలం

గతంలో బాగా వాడుకలో ఉండి ప్రస్తుతం కనుమరుగయినా కొన్ని అచ్చు తెనుగు పదాలు : 

చెడావులు = చెప్పులు
మక్కు         = రంపపు పొట్టు 
కరవాక       = సముద్ర తీరాల్లోని పల్లె 
తెలినుడులు = అచ్చ తెలుగు మాటలు 
తొలినుడులు = సంస్కృతపు మాటలు 

బారాబలావతీలు = అంటే ఊరికి తప్పని సరిగా ఉండాల్సిన  ప్రజాసేవకులు. వీళ్లని ' ఆయస గాండ్రు ' అని కూడా అనే వాళ్లు! 

కరణం ; రెడ్డి ; నంబి ( దేవాలయాల్లో పూజారి ) ; పురోహితుడు ( ఇంటిపట్టున ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే వాడు ) ; చాకలి; మంగలి ; కమ్మరి ; కుమ్మరి ; మాల; మాదిగ ; తలారి ; బారిక 

( మూలం : తెలుగు పొలుపు )

No comments: