నవ్వండి సరదాగా... ఒకే వాక్యాన్ని రెండు అర్ధాలలో.....
1. మీ సంగతి ఏమిటి?
మీసం గతి ఏమిటి?
2. గురూజీ వనం బాగుందా?
గురూ జీవనం బాగుందా?
3. ఆమే కమలమును తొక్కింది.
ఆ మేక మలమును తొక్కింది.
4. మాట మాట పెరిగింది.
మా టమాట పెరిగింది.
5. ఆహారం చూడ ఎంత బాగుందో!
ఆ హారం చూడ ఎంత బాగుందో!
6. మాతా తమరు నిమిషంలో చేరారు.
మా తాత మరునిమిషంలో చేరారు.
7. నావ లతలపై పడింది.
నా వల తలపై పడింది.
8. ఆమె కవితలతో జీవనం చేయును.
ఆమె కవి తలతో జీవనం చేయును.
9. మాతా మరను పట్టుకో.
మా తామరను పట్టుకో.
ఇదే మన తెలుగు భాష లోనే సాధ్యం
No comments:
Post a Comment