Adsense

Sunday, May 9, 2021

గర్భిణులకు రూ.5వేలు వచ్చే ప్రధాన మంత్రి మాతృ వందన్ యోజన (PMMVY)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీ, శిశు సంక్షేమం కోసం అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. తొలిసారిగా గర్భవతి అవుతున్న మహిళల సంక్షేమం కోసం 2017 జనవరిలో ప్రారంభించిన ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) మహిళలకు ఒక వరం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు అనేక మిలియన్ల మంది మహిళలు ఈ పథకం కోసం నమోదు చేసుకుని ఆర్థిక సహాయం అందుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, నవజాత శిశువుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా గర్భిణులు మరియు నవజాత శిశువుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పీఎంఎంవైవై పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలకు, తల్లి పాలిచ్చే మహిళలకు రూ .5000 ఆర్థిక సహాయం అందించబడుతుంది.

మూడు వేర్వేరు వాయిదాలలో రూ .5000 అందిస్తారు. అయితే.. 19 ఏళ్లకు ముందే గర్భవతి అయిన మహిళలకు ఈ పథకం కింద ప్రయోజనం లభించదు. ఈ పథకం ద్వారా గర్భిణుల బ్యాంకు ఖాతాకు కేంద్ర ప్రభుత్వం రూ .5 వేలు బదిలీ చేస్తుంది.

ఈ పథకం రోజువారీ వేతనంతో పనిచేస్తున్న లేదా ఆర్థికంగా వెనకబడి ఉన్న మహిళలకు వర్తిస్తుంది. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు సాయం చేయడం. ఈ ఆర్థిక సహాయం పొందడం ద్వారా వెనకబడిన వర్గాలకు చెందిన గర్భిణులు పనికి వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవడానికి సమయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పని చేస్తున్న మహిళలకు ఈ పథకం వర్తించదు. ప్రధాన మంత్రి మాతృ వందన పథకం కింద రూ. గర్భం దాల్చిన 150 రోజుల్లోపు గర్భిణి రిజిస్ట్రేషన్‌పై మొదటి విడతగా రూ .1000 ఆర్థిక సాయం అందుకోవచ్చు. రెండో విడతగా రూ. 2000లను 180 రోజుల్లో అందిస్తారు. మూడవ విడత డెలివరీ తర్వాత రూ. 2000 అందిస్తారు. అప్పటికీ బిడ్డకు బీసీజీ, ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్ బి వంటి ఇంజెక్షన్లు వేయించి ఉండాలి.

లబ్ధిదారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడం కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి మొదట లబ్ధిదారులు www.Pmmvy-cas.nic.in లో రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేయాలి. అంగన్ వాడీ కేంద్రాలను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంగన్ వాడీ సిబ్బందిని సంప్రదిస్తే వారు మీకు ఈ పథం పూర్తి వివరాలను అందిస్తారు.

No comments: