ఒకటి నుంచి 6000కు చేరుకున్న ఈ ఐదేళ్ల కాలక్రమంలో, ప్రయాణీకుల సౌకర్యాన్ని విస్తరించడంలో అద్భుత వేగం కనబరిచిన రైల్వే శాఖ
'డిజిటల్ ఇండియా'లో భాగస్వామిగా, దేశంలోని వివిధ ప్రాంతాలను అత్యధిక వేగవంత వై-ఫైతో అనుసంధానిస్తున్న రైల్వే శాఖ
ఈ నెల 15న హజారీబాగ్ రైల్వే స్టేషన్‌లో వై-ఫై ప్రారంభంతో 6000వ వై-ఫై స్టేషన్ ఘనతను సాధించిన రైల్వే శాఖ
అదే రోజు, ఒడిశా అంగుల్ జిల్లాలోని జరపద రైల్వే స్టేషన్‌లోనూ వై-ఫై సౌకర్యం ఏర్పాటు
రైల్వే శాఖ మరో ఘనతను సాధించింది. దేశంలో, వై-ఫైతో అనుసంధానమైన రైల్వే స్టేషన్ల సంఖ్యను 6000కు చేర్చింది.
రైల్వే ప్రయాణీకులు, సాధారణ పౌరులను డిజిటల్ వ్యవస్థలతో అనుసంధానించేందుకు సుదూర స్టేషన్లలోనూ వై-ఫై సౌకర్యాన్ని రైల్వే శాఖ విస్తరిస్తూ ఉంది.
తూర్పు మధ్య రైల్వే పరిధిలో, ఝార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న హజారీబాగ్ రైల్వే స్టేషన్‌లో ఈ నెల 15న వై-ఫై సౌకర్యాన్ని ప్రారంభించడం ద్వారా 6000వ స్టేషన్ ఘనతను రైల్వే శాఖ సాధించింది.
2016 జనవరిలో ముంబయి రైల్వే స్టేషన్‌లో వై-ఫై ప్రారంభించడం ద్వారా ఈ డిజిటల్ ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత, పశ్చిమ బంగాల్‌లోని మిడ్నాపూర్ స్టేషన్ 5000వ వై-ఫై స్టేషన్‌గా నిలవగా, హజారీబాగ్‌తో 6000వ స్టేషన్ మైలురాయిని రైల్వే శాఖ చేరుకుంది. అదే రోజు, ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న జరపద రైల్వే స్టేషన్‌లోనూ వై-ఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'డిజిటల్ ఇండియా' లక్ష్యాలను చేరుకోవడానికి, రైల్వే స్టేషన్లలో వై-ఫై సౌకర్యం తోడ్పడుతోంది. ఇది గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య డిజిటల్ దూరాన్ని తగ్గించి, పల్లె ప్రాంతాల్లో డిజిటల్ అడుగులను, మంచి వినియోగదారు అనుభవాన్ని పెంచుతోంది. ఇప్పుడు 6000 స్టేషన్లలో రైల్వే శాఖ వై-ఫై సౌకర్యాన్ని అందిస్తోంది.
స్వీయ మనుగడ పద్ధతిలో రైల్వే స్టేషన్లలో వై-ఫై సౌకర్యాలను కల్పిస్తున్నారు. దీనివల్ల రైల్వే శాఖపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్‌టెల్ సాయంతో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. గూగుల్, డాట్ (యుఎస్‌ఓఎఫ్ కింద), పీజీసీఐఎల్, టాటా ట్రస్టు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.
15.05.2021 నాటికి, రాష్ట్రాలవారీగా వై-ఫై రైల్వేస్టేషన్ల జాబితా:
15.05.2021 నాటికి, రాష్ట్రాలవారీగా వై-ఫై రైల్వేస్టేషన్ల జాబితా | ||
క్ర.సం. | రాష్ట్రం/యూటీ | స్టేషన్ల సంఖ్య |
1 | ఆంధ్రప్రదేశ్ | 509 |
2 | అరుణాచల్‌ప్రదేశ్ | 3 |
3 | అసోం | 222 |
4 | బిహార్ | 384 |
5 | ఛండీఘర్ | 5 |
6 | ఛత్తీస్‌ఘడ్ | 115 |
7 | దిల్లీ | 27 |
8 | గోవా | 20 |
9 | గుజరాత్ | 320 |
10 | హరియాణా | 134 |
11 | హిమాచల్‌ప్రదేశ్ | 24 |
12 | జమ్ము&కశ్మీర్ | 14 |
13 | ఝార్ఖండ్ | 217 |
14 | కర్ణాటక | 335 |
15 | కేరళ | 120 |
16 | మధ్యప్రదేశ్ | 393 |
17 | మహారాష్ట్ర | 550 |
18 | మేఘాలయ | 1 |
19 | మిజోరం | 1 |
20 | నాగాలాండ్ | 3 |
21 | ఒడిశా | 232 |
22 | పంజాబ్ | 146 |
23 | రాజస్థాన్ | 458 |
24 | సిక్కిం | 1 |
25 | తమిళనాడు | 418 |
26 | తెలంగాణ | 45 |
27 | త్రిపుర | 19 |
28 | ఉత్తరప్రదేశ్ | 762 |
29 | ఉత్తరాఖండ్ | 24 |
30 | పశ్చిమ బంగాల్ | 498 |
| మొత్తం | 6000 |
No comments:
Post a Comment