సిక్కిం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో- ‘‘సిక్కిం ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రమణీయ ప్రకృతి సౌందర్యానికి నిలయంగానే కాకుండా సహృదయులైన ప్రజలకు నెలవుగా ఈ రాష్ట్రం అందరి మన్ననలూ చూరగొంది. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో ఎంతో ముందంజవేసి, ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ రాష్ట్రం నిరంతరం వృద్ధి పథంలో పరుగు తీయాలని, ఇక్కడి ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా దైవాన్ని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.
Statehood Day greetings to the people of Sikkim. This state is blessed with rich natural beauty and is home to warm-hearted people. Sikkim has made great strides in areas like organic farming. Praying for the state’s continuous growth and for the good health of it’s citizens.
— Narendra Modi (@narendramodi) May 16, 2021
No comments:
Post a Comment