దేశానికి చేరిన 11,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 19 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటులు, 7000 లకు పైగా వెంటిలేటర్లు, 5.5 లక్షలకు పైగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కేటాయింపు, సరఫరా
కోవిడ్-19 కట్టడి, నివారణకు భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు విదేశాలు, వివిధ సంస్థలు 2021 ఏప్రిల్ 27వ తేదీ నుంచి సహాయ సహకారాలను అందిస్తున్నాయి. విదేశాలు విదేశీ సంస్థల నుంచి అందుతున్న సహాయ సామాగ్రిని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా, క్రమపద్ధతిలో వివిధ మంత్రిత్వశాఖలు, ప్రభుత్వశాఖల సహకారంతో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఎటువంటి జాప్యం లేకుండా వేగంగా అందిస్తోంది.
2021 ఏప్రిల్ 27వ తేదీ నుంచి 2021 మే 16వ తేదీవరకు 11,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 19 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటులు, 7000 లకు పైగా వెంటిలేటర్లు/ బై పాప్ , 5.5 లక్షలకు పైగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను రోడ్డు, విమాన మార్గాల ద్వారా వాటిని కేటాయించిన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.
Consignments | Quantity |
Oxygen Concentrators | 263 |
Ventilators/BiPAP/CPAP | 105 |
Oxygen Cylinder | 2,332 |
Remdesivir | 30,753 |
Casirivimab/Imdevimab | 20,000 |
2021 మే 15/16 న ఆస్ట్రేలియా, రొమేనియా, యుఎస్ఎ, కజాఖ్స్తాన్, యుకె, ఇయు (జర్మనీ, పోర్చుగల్, స్లోవేనియా), ఖతార్, కువైట్, ఐసిబిఎఫ్ (ఖతార్), బ్రిటిష్ ఆక్సిజన్ కంపెనీ (యుకె), మెడికల్ ఎయిడ్ (యుకె) నుంచి ఈ కింది ప్రధాన సరఫరాలు అందాయి.
No comments:
Post a Comment