Adsense

Monday, June 21, 2021

🎻🌹🙏నేడు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి (నిర్జల ఏకాదశి ) ..

🎻🌹🙏నేడు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి 
(నిర్జల ఏకాదశి ) ..
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జలైకాదశి అంటారు (జలం లేని ఏకాదశి), అనగా ఈరోజు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి అని అర్థము. 

నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు, దానం చేసిన వాడు, హరి పూజ చేసిన వాడు తిరుగులేకుండా శుభములు పొందుతాడు. 

ఏకాదశి నాడు సూర్యోదయానికంటే ముందే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తలారా స్నానం చేసి (ఆరోగ్యం సహకరించని వారు స్నానం చేసినా సరిపోతుంది), వారి వారి సంప్రదాయాలను అనుసరించి విభూతి కానీ, ఊర్ధ్వ పుండ్రాలు కానీ, కుంకుమ కానీ ధరించి భక్తితో హరి పూజ చేయాలి. 

ఈరోజు లక్ష్మీనారాయణ విగ్రహాలను కానీ, పటమును కానీ అష్టోత్తర శతనామాలతో తులసితో అర్చిస్తే ఆరోగ్యం కలుగుతుంది. అలాగే బిల్వ పత్రములతో అర్చన చేస్తే సంపదలు వస్తాయి. 

ఈరోజు శివుడిని కూడా పంచామృతాలతో అభిషేకించండి. ముఖ్యముగా శంఖ జలముతో (శంఖములో నీళ్లు పోసుకుని దానిని ధారగా శివుడు మీద పోయండి) అభిషేకించండి, తరువాత శివుడిని తుడిచి బొట్టు పెట్టి తులసి ఆకులతో కానీ, బిల్వ పత్రములతో కానీ శివుడిని కూడా పూజించండి. 

కటిక ఉపవాసము ఉండడము దోషము కనుక లఘువుగా ఆహారము స్వీకరించి అంటే పండ్లు, పాలు వంటివి తీసుకొని ఉపవాసం ఉండి, హరి భజనలు చేసి, తరువాత ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు దాటక ముందు శాకాహార భోజనం చేయవలెను. ఉపవాసం ఉన్నప్పుడు ఉల్లిపాయలతో చేసిన వంటలు కానీ, మసాలాలు కానీ తీసుకొనరాదు, సాత్విక ఆహారము మాత్రమే తీసుకొనవలెను. 

ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళు ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయకపోతే ఆ ఏకాదశి ఉపవాస ఫలితం మొత్తం వ్యర్థమైపోతుంది.
తినడానికి ముందు మహానుభావులైన గురువులను అర్చించి, యథాశక్తిగా దానములు చేసుకుని తరువాత తినాలి.
ఏకాదశి నాడు భక్తితో గురువులను పూజించి, వారి చుట్టూ ప్రదక్షిణలు చేసిన వాడికి స్వయముగా వైకుంఠమునకు వెళ్లి శ్రీ మహావిష్ణువు చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం వస్తుంది. 

ఏకాదశి నాడు హరి పూజ చేసిన తరువాత భాగవత కథలు విన్నా, చదివినా, ఇతరులకు చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. 

నిర్జల ఏకాదశి నాడు పద్మపురాణంలోని భీముడు ఉపవాసం చేసిన కథ తప్పక వినాలి. 

పూర్వం పాండవులు వనవాసం చేస్తూ హిమాలయాలలోని కేదారమునకు వెళ్లి భక్తితో శివుడిని ప్రార్ధించగా శివుడు ప్రత్యక్షమై మీకు ఏమి కావాలని అడుగగా, మాకు ఈ జన్మలోనే ముక్తి కావాలి అనగా, అప్పుడు శివుడు నాయనలారా! మీరు జ్యేష్ఠ మాసంలో ఇక్కడికి వచ్చారు. ఈ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి నాడు పొద్దుటే, తెల్లవారుఝామునే మందాకినీ నదిలో స్నానము చేసి, ఆ జలముతో నన్ను అభిషేకించి, గంధం పూసి, మీకు దొరికిన పుష్పములతో అర్చించండి. ఈ పూజ అయిపోయిన తర్వాత ఆచమన జలము తప్ప వేరే జలం కూడా తాగకూడదు. అలాగ ఉపవాసము చేసి, హరి హర నామ స్మరణ చేసి, మరునాడు ద్వాదశి నాడు బ్రాహ్మణోత్తములకు భోజనం పెట్టి మీరు తినండి; అని చెప్పగా భీముడు హడలిపోయి, పరమేశ్వరా! నేను భోజనం చేయకుండా ఉండలేను, అలాంటిది రోజంతా ఉపవాసం ఉండమంటే ఎలాగా? అని అడుగగా, శివుడు నాయనా! సంవత్సరానికి ఒక్కరోజే కదా! ఉండు అని చెప్పగా, సరేనని భీముడు శివుడికి మాట ఇచ్చి ఉపవాసం ఉండడం మొదలు పెట్టాడు.
తరువాత ఆకలికి ఓర్చుకోలేని భీముడు శివుడి దగ్గర నుంచి వరుసగా పాలు త్రాగటం, పండ్లు తినటం, తర్వాత అన్నం భిన్నం చేసుకొని తినే అవకాశం పొందాడు.
ఆ విధముగా ఏకాదశినాడు ఉప్పుడు పిండి చేసుకుని తినడం అలవాటు అయ్యింది. 

ఈ విధముగా భీముడి పుణ్యమా అని పరమేశ్వరుడు ఏకాదశి నియమాలలో మార్పులు చేశాడు. భీముడు ఉపవాసము చేసి మరునాడు దానధర్మములు చేసి భోజనం చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయనా! భవిష్యత్తులో భారత యుద్ధంలో మీరు విజయం పొందుతారు, మీరు శాశ్వత కీర్తి పొందుతారు అని వరమిచ్చాడు. 

భీముడి ఉపవాస కథ విన్న వారికి దిగ్విజయం లభించి తీరుతుంది....స్వస్తి...🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments: