Adsense

Friday, June 18, 2021

🎻🌹🙏ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే


లక్ష్మీదేవి రూపాలు

పాతాళంలో -నాగలక్ష్మి
గృహాలలో -గృహలక్ష్మి
గోవులలో -కామధేనువును
యజ్ఞాలలో -దక్షిణా దేవి
చంద్రుడిలో -శోభా లక్ష్మి
సూర్యుడిలో -తేజో లక్ష్మి
పృథ్వి లో -మహాలక్ష్మి

లక్ష్మీ స్థానాలు 

గురు భక్తి .దేవ భక్తి .మాతాపితృ భక్తి .కలవారిలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది.
అతి నిద్ర లేని వారిలో. ఉత్సాహం .చురుకుదనం. ఉన్నవారిలో లక్ష్మీకళ ఉంటుంది.
ముగ్గు. పసుపు .కుంకుమ. పువ్వులు .పళ్ళు .పాలు లక్ష్మి స్థానాలు.
దీపం .ధూపం .మంగళ ద్రవ్యాలు .ఆ తల్లికి నివాసాలు.
పాత్ర శుద్ధి శుభ్ర వస్త్రధారణ కలిగిన ఇల్లు అమ్మవారి నివాస స్థలం.
బుద్ధి .ధైర్యం .నీతి .శ్రర్థ.గౌరవించే స్వభావం .శాంతి. లక్ష్మి ని పెంచే శక్తులు.
సంతృప్తి లక్ష్మికి ప్రధాన నివాసం.

గజలక్ష్మీదేవి

ఐశ్వర్య మూర్తి ముఖ్యముగా గృహ భవనాలలో సంపదలు నిలిపే తల్లి మూల శక్తిగా ఈ తల్లిని అభివర్ణించవచ్చు కొలను లో ఉండి గజములు చేత అభిషేకించబడుతూ పద్మములు ధరించిన రూపం ఇది అష్టలక్ష్ముల లో అతి ప్రధాన లక్షీ గృహ ద్వారా లలో దేవాలయ ద్వారాలలో ఈ గజలక్ష్మి ప్రతిమని ఉంచితే ఆ ఇంటికి ఆలయానికి క్షేమ సంపదలు లభిస్తాయని శాస్త్రం.

ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే..🌞🙏🌹🎻

No comments: