Adsense

Tuesday, June 22, 2021

🙏🔱మాంగల్యబలాన్ని ప్రసాదించే శుభ మంగళాదేవి🔱


  
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
       
దక్షిణ కర్ణాటకలో అతి పెద్ద నగరం మంగుళూరు. చారిత్రక ప్రసిధ్ధి గల నగరం.
ఇక్కడ 10 వ శతాబ్దంనాటి మంగళాదేవి ఆలయం
ఈనాటికీ ఎంతో మహిమాన్వితమై విరాజిల్లుతోంది.

కాళీకాదేవి మరొక రూపమైన మంగళాదేవి 
ఇక్కడ కొలువైన గాధను ఒకసారి తెలుసుకుందాము.

ఒకానొక కాలంలో హిమాలయా పర్వత శ్రేణులలోని  నేపాల్ దేశము నుండి
మశ్చీంద్రనాధ్, 
ఘోరఖ్ నాధ్
అనే యిద్దరు సాధు సత్పురుషులు దేశాటనం చేస్తూ 
దక్షిణపశ్చిమ దిశలో
తుళునాడులోని మంగళాపురా అనే ప్రాంతానికి
చేరుకున్నారు. అక్కడ 
నేత్రావతి  నదీతీరాన కపిలముని ఆశ్రమంలో నివసిస్తూ కపిలముని అడుగుజాడలలో నడుస్తూ విద్యార్ధులకు
గురుకుల రీతిలో
సకల విద్యలు నేర్పేవారు. 

ఆనాటికి  తుళునాడును ఆలుప్పావంశ రాజైన
కుందవర్మ పరిపాలిస్తూ 
వుండేవాడు.

ఆయన నేత్రావతీ నదీ తీరాన ఇద్దరు సాధువులు వేంచేసియున్నారన్న విషయం తెలుసుకొని మశ్చీంద్రనాధ్ , గోరఖ్ నాధ్ ల ఆశీర్వాదం పొందాలని వచ్చి వారికి సకల మర్యాదలు చేశాడు.

వారు కపిలముని ఔన్నత్యం గురించి , నేత్రావతీ నది ప్రాశస్త్యం గురించి వివరించి  తమ ఆశ్రమం నిర్మించుకొని కపిలముని ఆశయాలను నెరవేర్చడానికి తగిన భూవసతి కల్పించమని మహారాజును కోరారు. అదే సందర్భంగా ఆ ప్రాంతపు మహనీయులగాధలను కూడా రాజుకు వినిపించారు.

ఇక్కడే  జమదగ్ని కుమారుడైన పరశురాముడు మంగళాదేవి కి  ఆలయం
నిర్మించాడు.  అందుకే ఆ ప్రాంతానికి
మంగళాపురా అనే పేరు
వచ్చిన వైనం తెలిపారు. 

ఆ ప్రాంతాలనన్నింటినీ కుందవర్మకి
తిప్పి చూపారు. ఆ సందర్భంలో,
 అక్కడ ఒకదగ్గర నిలబడి  తమ దివ్యదకష్టితో  , " ఇక్కడ భూమిలో కూరుకుపోయివున్న శివలింగాన్ని, మంగళాదేవిని
వెలుపలకి తీసి ప్రతిష్టించమని ఆదేశించారు.
కుందవర్మ మహారాజు ఆనందంతో మశ్చీంద్రులు , గోరఖ్ నాధ్ ల ఆదేశాన్ని పాటించి శివలింగాన్ని , మంగళాదేవి ప్రతిమలను బయటకు తీయించి సాధువులు
చెప్పినట్లు ఆలయం నిర్మించడానికి ఏర్పాట్లు
చేశాడు. 
మశ్చీంద్రనాధ్, ఘోరఖ్ నాధ్  పర్యవేక్షణలో,  ఆలయ నిర్మాణం జరిగింది.  ఆనాటి
నుండి యీనాటి వరకు
భక్తులు మంగళాదేవిని అత్యంత భక్తి శ్రధ్ధలతో కొలుస్తున్నారు.

ఈ ఆలయం మరీ పెద్దది కాకపోయినా దేశం నలుమూలల నుండి భక్తులు మంగళాదేవి దర్శనానికి వస్తూంటారు. కొంతవరకు
కేరళ శైలిలో నిర్మించబడిన
ఆలయం. 

కదిరిలో మంజునాధేశ్వరుని ఉత్సవాలు జరపడానికి
ముందుగా మంగళాపురా మంగళాదేవికి పట్టుచీర సమర్పించి,ఆ దేవికి సర్వాలంకారాలు చేసి,
శ్రధ్ధగా పూజలు జరిపిన అనంతరమే కదిరిలో  ఉత్సవాలు
ఆరంభిస్తారు. ఈ ఆచారంఈనాటికీ కొనసాగుతున్నది. 

వయసుకు వచ్చిన కన్యలు ఉపవాస దీక్షబూని
మంగళాదేవిని భక్తితో పూజించిన వారికీ మంచి భర్త లభిస్తాడని భక్తుల ధృడ నమ్మకం. 

ఈ ఆలయంలో మంగళాదేవికి నవరాత్ర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు.
పదవరోజున రధయాత్రోత్సవంతో ముగుస్తుంది.  

భక్తుల 
సమస్యలు, కష్టాలు  ఈ
మంగళాదేవి తొలగించి
 సుఖసంతోషాలను  అనుగ్రహిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం.

దక్షిణ కర్ణాటకలోని మంగుళూరుకి 12 కి.మీ దూరంలొ బోలారులో
ఆలయం వున్నది.
మంగళపురా అన్న పేరే
కాలక్రమేణా మంగుళూరుగా రూపాంతరం చెందింది...సేకరణ..🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: