Adsense

Sunday, June 6, 2021

నేడు అపర ఏకాదశి.. వ్రతం ఎలా ఆచరించాలంటే..

నేడు అపర ఏకాదశి శుభాకాంక్షలు..
🎻🌹🙏నేడు అపర ఏకాదశి సందర్భంగా...

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

అపర_ఏకాదశి, సిద్ధ_ఏకాదశి అని కూడా అంటారు.

ఈ రోజు ఉపవాసం అన్ని బాధలు మరియు అడ్డంకులను తొలగిస్తుంది. పౌరాణిక నమ్మకాల ప్రకారం, ఈ ఉపవాసాన్ని పాటిస్తే, విష్ణువు మాత్రమే కాదు, లక్ష్మి దేవి కూడా అనుగ్రహిస్తుందని నమకం.

పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి క్రమం సాధించే సమయంలో ఆయన నుదిట నుండి ఒక చెమట బిందువు రాలి నేల పై పడింది. అలా పడిన ఆ చెమట బిందువు ఒక రాక్షసఆకారం పొందింది, ఆ రాక్షసుడు పెరిగి పెద్దవాడై తన విశ్వరూపాన్ని చూపిస్తూ, బ్రహ్మదేవుడిని నాకు ఆహారం కావాలి? అని ప్రశ్నించాడు. పుట్టించిన వాడే ఆహారాన్ని కూడా అందివ్వాలి, నారు పోసిన వాడు నీరు పోయడా అనే సామెత. బ్రహ్మదేవుని చెమట చుక్క రాక్షసఆకారం పొందింది ఇది బ్రహ్మ సృష్టి కనుక ఆహారం కూడా బ్రహ్మ ఇవ్వాలి, దాంతో బ్రహ్మదేవుడు ఆలోచించాడు, ఇతడు సృష్టికి కొద్దిగా భిన్నమైన రూపంలో జన్మించాడు, సృష్టి క్రమంలో జీవులు అంతా కూడా నాలుగు రకాలుగా పుడతారు అని అంటుంది వేదం అవి
అండజములు, స్వేదజములు, ఉద్బుజములు, పిండజములు. అండజములు - గుడ్డుబద్దలు కొట్టుకుని బయటికి వస్తాయి, స్వేదజములు - చెమటనుండి పుడతాయి పేలవంటివి, ఉద్బుజములు - భూమిని చీల్చుకుని పైకి వస్తాయి చెట్లవంటివి, పిండజములు కడుపులోనే పెరిగి పెద్దవై ప్రాణి రూపంలో బయటకి వచ్చేవి.

జైన్ ధర్మంలో అహింస అని ఒక చిన్న కథ

ఒక జైన మతస్థుడుకి ఒక పేను దొరికిందట ఆ పేను నెత్తిలో చేరి హింస పెడుతుంది చేతికి దొరికిన అ పేనును చంపుదామ వద్ద అని ఆలోచన చేశాడు ఇది స్వేదజము చెమట నుండి పుట్టింది, జైన ధర్మం కాబట్టి చంపకూడదు, వదిలి పెడదామా అంటే హింస పెట్టిందే ఇది జైన చేతిలో ఉండేటువంటి హింస గుణానికి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇది స్వేదజము. బ్రహ్మదేవుని చెమట నుండి పుట్టినటువంటి ఆ రాక్షసునికి బ్రహ్మదేవుడు ఏమి చెప్పాడు అంటే, ఈ రోజు ఏకాదశి ఎవరైతే ఈ రోజున భోజనం చేస్తారో ఆయ భోజన పదార్థం, ఆహారం నీకు సంబంధించింది. కనుక ఆ పదార్థాన్ని ఆశ్రయించి ఉండు,  ఈ వేళ అన్నం ఎవరు తింటారో ఆ అన్నం నీది, నీకు సంబంధించిన ఆ ఆహారం వాడు తింటాడు కాబట్టి వాడు పాపి అవుతాడు. అంటూ ఒక నియమం ఏర్పాటు చేశాడు. కనుక ఈ రాక్షసుడు ఈ రోజు మొదలుగా ఏకాదశి నాటి ఆహారం అంతా కూడా నాదే అంటూ నియమం చేసుకున్నాడు.

మనం కూడా ప్రతిరోజూ భోజనం చేసే సమయంలో మన పళ్లెంలో అన్నం పెట్టుకున్న తర్వాత దాని చుట్టూ నీరు చల్లి సంరక్షించి ఇది నాది అంటూ చెబుతాం. కొంత పదార్థాన్ని బయట పెట్టేసి అవి నీవి అంటూ జీవులకు ఇచ్చేస్తాం. ఇది నాది అని చెప్తాము. అలా రాక్షసుడు కూడా ఏకాదశి నాటి భోజన పదార్థాలు అన్ని కూడా నావి అని అనుకున్నాడు. కనుక ఈ రోజు మనం ఉపవాసం చేయాలి. "ఏకాదశి వ్రతం ఉపవాస వ్రతం". విష్ణువుకు ప్రీతికరంగా ఈరోజు మనం అపర ఏకాదశి ఉపవాస వ్రతం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది, ఆనందం చేకూరుతుంది, పుణ్యబలం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం అని అంటుంది సాంప్రదాయ విజ్ఞానం. కనుక ఈ రోజు మనం ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం...🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: