గోవా నుంచి, సముద్ర-ఆకాశ సమన్వయ వైద్య సాయాన్ని భారతీయ తీర రక్షకదళం (ఐజీసీ) వేగంగా చేపట్టింది. ఆదివారం ఉదయం 4.30 గం.కు ముంబయిలోని సముద్ర సహాయక సమన్వయ కేంద్రానికి సమాచారం వచ్చింది. 50 ఏళ్ల కొరియా జాతీయుడు, ఎంటీ ఎలిమ్ నౌక కెప్టెన్‌కు అత్యవసర వైద్య సాయం అవసరమైందన్నది ఆ సమాచారం సారాంశం. ఆ సమయంలో గోవా తీరానికి నైరుతి దిశలో 109 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న నౌకకు ఆ సమాచారాన్ని పంపి, గోవా దిశగా పంపారు. అదే సమయంలో, రోగి తరలింపు కోసం వేగవంతమైన సహాయక ఆపరేషన్‌కు గోవాలోని తీర రక్షకదళ జిల్లా ప్రధాన కార్యాలయం ప్రణాళిక రచించింది.
ఉదయం 5.30 గం.కు ఐసీజీకి చెందిన సి-158 నౌక గోవా నుంచి బయల్దేరి, ఎంటీ ఎలిమ్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపింది. రోగిని వేగంగా తీసుకొచ్చేందుకు, గోవాలోని తీర రక్షకదళ వాయు స్థావరం నుంచి చేతక్ హెలికాప్టర్ కూడా బయల్దేరింది. బలమైన రుతుపవన గాలుల మధ్యే ప్రయాణించిన చేతక్ హెలికాప్టర్ లక్షిత నౌకను చేరింది. వాయుదళ డైవర్ సాయంతో రోగిని హెలికాప్టర్‌లోకి చేర్చారు. గోవాలోని వాస్కోలో ఉన్న ఎస్‌ఎంఆర్‌సీ ఆసుపత్రికి సురక్షితంగా చేర్చారు. రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.
No comments:
Post a Comment