Adsense

Sunday, June 20, 2021

🕉 తిరుమలలో జియ్యంగార్లు ఎవరు? వారి అధికారం ఏమిటి ? 🕉

🕉 తిరుమలలో జియ్యంగార్లు ఎవరు? వారి అధికారం ఏమిటి ? 🕉
@ ఆలయంలో వ్యవహారాలూ చూడటానికి కైంకర్య ఏర్పాట్లు చెయ్యడానికి ఆలయాధికార వ్యవస్థ వుంది. కైంకర్యానికి పూలు, ఫలాలు, గంధం, తులసి, దీపారాధన నెయ్యి, ఇతర పదార్ధాలు  సరైనవా లేక నాసిరకమా, ఇవ్వవలసిన మోతాదులో అధికారులు ఇస్తున్నారా, సకాలంలో కైంకర్యాలు జరుగుతున్నాయా, లోపాలున్నాయా  అన్న విషయం నిర్ణయం చెయ్యాలంటే అధికార్లకు, అర్చకులకు సంబంధం లేని ఒక వ్యవస్థ ఉండాలని భగవద్రామానుజులు తలచారు. అటువంటి వ్యవస్థ అధికారి ఆచార వ్యవహారాలు తెలిసినవాడై, స్వతహాగా నియమనిష్టలు కలవాడై, పాండిత్యంలో వైరాగ్యంలో అధికుడైతేనే అతని మాటపై గౌరవం ఉండే అవకాశం ఉంటుందని తలచారు. అంతేకాక భక్తులు సమర్పించే ధనధాన్యాలు, మాన్యాలు, ప్రత్యేక బహుమతులు ఇతర సేవలు చేస్తే ఆ వచ్చే వాటిని సరిగ్గా లెక్క చూసే వ్యవస్థ ఉండాలని, అధికార్లకు ఆలయ అర్చకులు చేసే కైంకర్యం తెలియకపోవడం వలన ఇటువంటి వ్యవస్థ అటు అధికార జ్ఞానం, ఇటు అర్చనకు సంబంధించి పూర్తి వివరం తెలిసున్దాలని ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థనే “ఏకాంగి” వ్యవస్థ అనేవారు. తర్వాతి కాలంలో అదే జియ్యంగారి మఠం అయ్యింది.

@ ముందుగా శ్రీశైలపూర్ణులు, శ్రీ అనంతాచార్యులు మొదలైన పాండిత్య ప్రతిభ కలవారు తర్వాత కాలంలో ఆచార్య పురుషులుగా ప్రసిద్ధికి ఎక్కారు. ఆలయ అధికార్లు అందించే పదార్ధాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయా కైన్కర్యానికి దిట్టం ప్రకారం ఇస్తున్నారా లేదా, సమయపాలన చేస్తున్నారా అని చూసే అధికారం ఎకాంగిది/జియ్యంగార్ ది. మూలవరులకు కానీ ఉత్సవ మూర్తులకు కానీం ఆలయంలో జరిగే ప్రతీ స్వామివారి సేవా కార్యక్రమాలలో ఈ వ్యవస్థల ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని ఏర్పాటు చేసారు. ఒక్క ఏకాంగి పనిభారం ఎక్కువని గ్రహించి మరొక నలుగు ఏకాంగులు ఉండాలన్న నిర్ణయాన్ని చేసారు. ఆ విష్వక్సేన ఎకాన్గికి సన్న్యాస దీక్షనిచ్చి “శఠగోపులు” అని పేరు పెట్టారు. శ్రీ వేంకటేశుని ఆదాయం, చర్చు, దివ్య ఆభరణాలు మొదలైన వాటి విషయంలో  శఠగోపయతీన్ద్రునికి సంబంధం కళ జనుల చేత ఒక జవాబుదారీ పత్రం వ్రాయించాలి అని రాజుద్వారా కట్టుదిట్టం చేసారు.

@ కాలక్రమంలో జియ్యంగార్లకు నామమాత్ర అధికారమే మిగిలి దేవస్థానం వారు తయారు చేసి ఇచ్చిన స్వామివారి కిందటి దినపు ఆదాయ విశేషాలు కొలువులో శ్రీనివాసునికి సమర్పించే లాంచనం మాత్రం మిగిలింది. వీరు ఆలయ తలుపులు తెరిచేప్పుడు వారి ముద్ర లేనిదే ప్రవేశం జరగదు. ఈ జియ్యంగార్లు సన్న్యాసులు. స్వామీ వారి కైన్కర్యంలో ఏ ఒక్కరోజూ అంతరాయం ఉండకూడదని ఇద్దరు జియ్యర్లు ఉండే సాంప్రదాయం – పెద్ద జియ్యరు పరమపదం పండితే చిన్న జియ్యరు పెద్ద జియ్యరై, వెంటనే మరొక యోగ్యుడైన వ్యక్తిని చిన్న జియ్యరుగా నియమించడం జరుగుతుంది. అందుకే మనకు పెద్ద జియ్యంగారి మఠ౦, చిన్న జియ్యంగారి మఠం ఉంటాయి. వీరు వంశ పారంపర్యంగా వచ్చే మిరాశీదార్లు కాదు.

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

No comments: