Adsense

Monday, June 28, 2021

🎻🌹🙏అన్నవర క్షేత్రములో పరమేశ్వరుడు శ్రీ వీర వేంకట సత్యనారాయణ అన్న పేరుతో ఆవిర్భవించాడు...


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

ఇంకో పేరు పెట్టుకోకుండా ఆయన ఇలా ఎందుకు పెట్టుకున్నాడు?

               🌹‘శ్రీ’🌹

అనగా సమస్త ఐశ్వర్యములను మనకు ఇవ్వగలిగినవాడు. భయమును తీర్చకలిగిన వాడు. మనము ఏ పాపములను చేశామని బెంగ పెట్టుకున్నామో వాటిని ఆయన దగ్గరకు వెళ్ళి నేలమీద పడి నమస్కారము చేస్తే ఆ పాపములను తీసివెయ్య కలిగినవాడు. సద్బుద్దిని ఇచ్చిమంచి ప్రవర్తనతో ప్రవర్తించేటట్లుగా చెయ్య కలిగినవాడు. ఎక్కడ నిలబడి మనసులో తలచుకున్నా ఆయనకు వినపడి ఆదుకోగలిగిన పరిపూర్ణమైన శక్తివంతుడు. ఇన్ని లక్షణములు ఉన్నవాడు కాబట్టి శ్రీ

            🌷‘వీర’🌷

వీర అనగా ఆయన దాన వీర, దయా వీర, ధర్మ వీర అని మూడు రకములైన వీరత్వమును పొందాడు. దాన వీర కేవలము కలిగి ఉ0డటము కాక మనకు ఏది కావాలన్నా ఇవ్వగల లక్షణము ఉన్నవాడు ఏదైనా ఇవ్వగలడు. సత్సంతానము కలగాలి అని పెళ్ళి చేసుకుంటారు. కొడుకు పుట్టి వాడు వంశమును వృద్ధి చేయాలి. కూతురు పుట్టాలి ఆమెను కన్యాదానము చేసి తరించాలి. కొడుకు కూతురు పుట్టాలి అంటే పరమేశ్వరుని అనుగ్రహము ఉండాలి. ఆయన ఏదైనా ఇవ్వగలగిన వాడు. ఆయన తలచుకుంటే ఆయన ఇవ్వలేనిది లేదు. సత్యనారాయణ స్వామిని నమ్ముకుంటే అసంభవములైన పనులు కూడా సంభవములు చెయ్యగల గొప్ప స్వరూపము సామాన్యమైన స్వరూపము కాదు దాన వీరుడు...సేకరణ...🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: