Adsense

Friday, June 18, 2021

జ్యేష్ఠ శుద్ధ అష్టమి శుక్లాదేవీ_పూజ

🎻🌹🙏శుక్లాదేవీ పూజ

జ్యేష్ఠ శుద్ధ అష్టమి శుక్లాదేవీ_పూజ
జ్యైష్ఠశుక్లాష్టమ్యాం శుక్లాదేవీపూజా కార్యా ౹
సా పరవిద్ధా గ్రాహ్యా౹ యుగ్మాగ్నివాక్యాత్ ౹
తదుక్తం బ్రహ్మాండపురాణే-

గ్రైష్మికే ప్రథమే మాసి శుక్లపక్షే నరాధిప౹
శుక్లా మారాధయేద్దేవీమష్టమ్యాం విధివద్ద్విజాః॥

జ్యేష్ఠ శుద్ధ అష్టమినాడు శుక్లాదేవీపూజను చేయవలెను. దీనిని పరవిద్ధగా గ్రహించవలెను. యుగ్మవాక్యమట్లు గలదు. గ్రీష్మ ఋతువుయెక్క తొలిమాస శుక్లపక్షాష్టమినాడు శుక్లాదేవిని ఆరాధించవలెనని బ్రహ్మాండపురాణము చెప్పుచున్నది.

కాళీదేవి యొక్క వదనమునుండి వచ్చిన తల్లి పేరు శుక్లాదేవి. క్షత్రియులకు కులదేవతగా కొన్ని ప్రాంతాలలో పూజలందుకుంటూ ఉంటుంది. ధవళవర్ణ దేహకాంతితో, తెల్లని వస్త్రాభరణములను, గంధమును ధరించి ప్రకాశిస్తూ ఉంటుంది.

శుక్లాంబరధరే దేవి శుక్ల మల్యాద్రి భూషితే శుక్లగంధనులిప్తాంగి శుక్లాదేవి నమోస్తుతే...

ఈ శ్లోకముతో అమ్మవారిని ఈ రోజు పూజించాలి...సేకరణ..🌞🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments: