Adsense

Wednesday, June 23, 2021

🕉 ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం 🕉


తిరుమల శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు బుధ‌వారం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి అభ‌య‌మిచ్చారు.

ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. అనంత‌రం ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారికి, దేవేరులకు శ‌త‌క‌ల‌శ తిరుమంజ‌నం చేపట్టారు. 

సాయంత్రం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ జరిగింది. స‌హ‌స్ర‌దీపాలంకార సేవ త‌రువాత స్వామి, అమ్మ‌వార్లు ముత్య‌పు క‌వ‌చం ధ‌రించి ఆల‌య మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.

No comments: