# బంధువుల ఇళ్ళలో కానీ లేదా మనకు తెలిసిన వారి ఇళ్ళలో కాని ఎవరైనా చనిపోతే ఆ రోజు వెళ్ళలేని వారు తర్వాత పరమార్శించడానికి వెళ్ళాలనుకునే వారుకానీ లేదా భర్త చనిపోయి వైధవ్యము ప్రాప్తించిన స్త్రీని ఎప్పుడు పడితే అప్పుడు పరమార్శించడానికి వీలులేదు .. అందుకు శాస్త్ర ప్రకారంగా ఈ క్రింది నియమాలను పాటించాల్సి ఉంటుంది.
పరమార్శకు పనికి వచ్చే తిధులు:-
విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిధులు అనుకూలమైనవి.
పరమార్శకు పనికి వచ్చే నక్షత్రాలు:-
అశ్విని, భరణి, ఆరుద్ర, పుబ్బ, ఆశ్లేష, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ నక్షత్రాలు అనుకూలమైనవి.
పరమార్శకు పనికిరాని వారాలు :- మంగళవారం, గురువారం, శుక్రవారములు పరమార్శకు అనుకూలం కాదు.
గమనిక :-
పరమార్శించడానికి నెలరోజుల వీలుకాక పోయినచో సరిమాసలలో మాత్రం పరమార్శించ కూడదు. భేసి మాసలలో పరమార్శించవచ్చును. పరమార్శకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు పరిగడుపున వెళ్ళకూడదు. ఏదైనా తిని వెళ్ళాలి.
పరమార్శకు వెళ్ళేప్పుడు వెంబడి తీసుకు వెళ్ళకుండా జాగ్రత్త పడవలసినవి:-
జాతి రత్నాలతో చేయబడిన ఉంగరాలు, ఆభరణాలు, రక్షాయంత్రాలు, పట్టు వస్త్రాలు మొదలైనవి ఒంటిమీద లేకుండా జాగ్రత్త పడాలి, వాటిని ఇంట్లో పెట్టి వెళ్ళాలి. పొరపాటున అవి ధరించుకుని వెళితే అవి శక్తిని కోల్పోతాయి. తిరిగి వాటికి శాస్త్రోక్తకంగా శుద్ధిని చేయించి ప్రాణప్రతిష్ఠ జరిపించుకోవాలి.
No comments:
Post a Comment