🌹 వారంలో ఒకసారి అంటే శుక్రవారం నాడు అభిషేకానంతరం శ్రీవారి నొసటన ఈ తిరుమణికాప్పు సమర్పిస్తారు. దీనికి 16 తులాల పచ్చ కర్పూరం, 1.5 తులాల కస్తూరి వినియోగిస్తారు. కన్నులు పూర్తిగా కప్పబడినట్లుగా అలంకరించే ఈ తిరునామాలు మరలా గురువారం వరకు యథావిధిగా ఉండి, గురువారం నాటి నేత్ర దర్శనం సందర్భంగా సడలించబడతాయి.🌹
🌹బ్రహ్మోత్సవాల ఆ సమయంలో మాత్రం ఈ నామం సమర్పణ రెట్టింపుగా ఉంటుంది. ప్రతి ఏటా 10 రోజుల (తొమ్మిది రోజులుగా వ్యవహారం) పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే శుక్రవారం నాడు - మధ్యలో వచ్చే శుక్రవారం నాడు - ముగింపు తర్వాత వచ్చే శుక్రవారం నాడు - ఇలా 3 లేదా 4 శుక్రవారాల్లో స్వామివారి నామాల అలంకరణ రెట్టింపుగా ఉంటుంది. ఇందుకుగాను 32 తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరి వినియోగించబడుతుంది. అందువల్లే బ్రహ్మోత్సవ సమయాల్లో వచ్చే 3 లేదా 4 శుక్రవారాలను 'రెట్టింపు శుక్రవారాలు' అని తిరుమల ఆలయ సాంప్రదాయంలో ప్రతీతి. ఈ పచ్చకర్పూర నామం తిరుమల ఆలయంలో అనుసరించే వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం అలంకరిస్తారు. 🌹
🌹స్వామి వారి కృప మనందరిపై మెండుగా ఉండాలని కోరుకుంటూ🌹
🌹ఓం నమో వెంకటేశాయ 🌹
No comments:
Post a Comment