Adsense

Wednesday, June 9, 2021

చెట్టంతా దేవుళ్లే..

 


ఉసిరి చెట్టుకు మన సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. బ్రహ్మదేవుని కనుకొనల నుంచి రాలిపడిన ఆనందబాష్పకణం కనుక ఉసిరికి ‘ఆమలకం’ అనే పేరువచ్చింది. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో రుద్రుడు, పైభాగంలో బ్రహ్మదేవుడు, కొమ్మల్లో సూర్యుడు, ఉపశాఖలలో సకల దేవతలూ ఉంటారని పురాణాలు తెలియజేస్తున్నాయి.

ఉసిరి చెట్టును సంస్కృతంలో ‘ధాత్రీ వృక్షం’ అంటారు. ధాత్రి అంటే భూమి. ధాత్రి అంటే దాది. భూమి వలె ఆదరించి, దాదివలె పోషించే ఈ ఉసిరి పూజార్హమైనదని పెద్దలు చెబుతున్నారు.

 ఉసిరి, తులసి ఒకేచోట పుట్టాయన్న ‘శివపురాణం’ కథనం ఆధారంగా కార్త్తిక మాసంలో ఈ రెండింటికీ మన ఆరాధనలో అధిక ప్రాధాన్యం కలిగింది. తులసి మొక్క దగ్గరే ఉసిరి మొక్కను ఉంచి పూజించడం చూడొచ్చు.

 ఈ మాసంలో ఉసిరి కాయపై వత్తి వేసి దీపం వెలిగిస్తారు. ఈ దీపం కార్త్తిక దామోదరుడైన విష్ణువుకు అంత్యంత ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి.

 సామాజిక సహజీవనం లక్ష్యంగా ఉద్దేశించిన  వనభోజనాలు ఉసిరి చెట్టు నీడలో చేయాలని నియమం ఉంది. ఉసిరి చెట్టుగాలి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని గుర్తించారు.

ఉసిరి ఔషధాల నిధి. కార్తిక  సోమవారాలు, నాగుల చవితి, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో  ఉపవాసం తరువాత చేసే భోజనంలో విధిగా ఉసిరిక పచ్చడి ఉండాలని నియమం. అది జీర్ణాశయంలో ఆమ్లరసాల సమతౌల్యాన్ని కాపాడుతుందని ఆయుర్వేదం చెబుతుంది...సేకరణ..🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: