🌷*జున్ 10 గురువారం శనైశ్చర జయంతి సందర్భంగా...* 🌷
🌹*శనైశ్చర జయంతి*🌹
🌸*నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం౹*
*ఛాయా మార్తాండ సంభూతం తంనమామి శనైశ్చరం౹*🌸
అని శనీశ్వరుడిని ప్రార్థించడం ఆచారం.
శనిభగవానుని ప్రీతికై శివార్చన, గ్రహశాంతికోసం దానం, జపం మొదలైనవి చెయ్యడం వల్ల శనిదేవుని అనుగ్రహంతో జాతకం లోనున్న శనిగ్రహ సంబంధిత దోషాలు ఉపశమిస్తాయి.
నవగ్రహాలలో అత్యంత ప్రభావశాలి శనిదేవుడు. నీలాకాశంలో నీలాంజన సమాభాసుడై నీలిహర్మ్యంలో నీలమణులతో ఉన్న దివ్యాలయంలో ఆయన కొలువుదీరి ఉంటాడు. ఎన్నో ఉపగ్రహాలతో కాంతివలయంలో తేజోమయునిగా దర్శనమిస్తాడు. గ్రహరాజు అయిన సూర్యదేవునికి, ఛాయాదేవికి సావర్ణి మనువు తరువాత జన్మించిన వాడు శనిదేవుడు. మెల్లనైన నడక కలవాడు కాబట్టి శనీశ్వరుడు మందుడని పేరు వచ్చాయి. ఆయన యమధర్మరాజుకు, యమునకు సోదరుడు, శని భార్య జ్యేష్టాదేవి. శనివారంతో కలిసి ఉన్న త్రయోదశి తిథిని శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. ఏటా రెండు మూడు శని త్రయోదశి తిథులు వస్తాయి. శని జయంతి, శని త్రయోదశి తిథిలతో పాటు మాఘ బహుళ చతుర్దశి, మార్గశిర శుద్ధ అష్టమి, శ్రావణ మాసంలో వచ్చే రెండవ శనివారము కూడా శని ఆరాధనకు శ్రేష్టమైనవి.
వైశాఖ బహుళ అమావాస్య రోజున శనీశ్వరునికి నువ్వులనూనెను వెలిగిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. శనిదేవుడు జీవుల కర్మఫల ప్రదాత. మనం చేసిన పుణ్యపాపకార్యాలకు ఫలితాన్ని ఇచ్చేది శనీశ్వరుడే. శివుడు శనికి వక్రదృష్టి, ఇతరశక్తులనిచ్చి కర్మఫలదాతను చేశాడు. వాటిసాయంతో ఆయన క్రమశిక్షణ, మంచి లక్షణాలను కాపాడుతూ, చెడుని, చెడ్డవాళ్లను వారు చేసే కర్మలను అనుసరించి శిక్షించడం చేస్తాడు. ఇంకా మంచిపనులు చేసేవాళ్లకు, శుభాలు, ఉన్నతస్థితి కల్పించడం చేస్తాడు. శని యొక్క వక్రదృష్టి నుండి తప్పించుకోవాలంటే చెడ్డపనులను చేయకుండా ఉండాలి. మంచి పనులే చేయాలి. అందుకే శనీశ్వర జయంతి రోజున నలుపు రంగు దుస్తులను సమర్పించుకోవాలి. శంఖుపూలతో ఆయనను అర్పించాలి. తైలాభీషేకం చేయించాలి. దశరథ కృత శని స్తోత్రం భక్తితో పఠించే వారికి ఈతిబాధలుండవు.
శనిని పాపగ్రహంగా భావిస్తారు. చాలామంది శని పేరు వింటేనే అరిష్టం అని, ఆయన విగ్రహాన్ని తాకడం కూడా దోషమని భావిస్తారు. వాస్తవానికి శనిదేవుడు న్యాయాధికారి. ఎవరినీ అకారణంగా బాధించాడు. మానవుల పాప కర్మలను అనుసరించి వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. దాన ధర్మాలతో సత్యం, అహింసలను ఆచరిస్తూ, పవిత్రంగా జీవించే వారికి ఎటువంటి ఆపద వాటిల్లకుండా కాపాడతాడు. సకల శుభాలను, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని కలగచేసేది శనిదేవుడే. లౌకిక, భౌతిక సుఖాల పట్ల, సంపదల పట్ల వైరాగ్యం కలిగించి, భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా, భక్తితో ఆయనను వేడుకుంటే సకల శూభాలూ కలుగుతాయి. శని వివిధ వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాలలో స్థిరత్వాన్ని, వృద్ధిని కలగచేస్తాడు.
శనీశ్వరుని జయంతి నాడు ఆయన స్తోత్రాలను పఠించడం తో పాటు
నమో శనైశ్చరా పాహిమాం
నమో మందగమనా పాహిమాం
నమో సూర్యపుత్రా పాహిమాం
నమో చాయసుతా పాహిమాం
నమో జేష్ఠ పత్ని సమేత పాహిమాం
నమో యమ ప్రత్యధిదేవా పాహిమాం
నమో గృధవాహాయ పాహిమాం".
అనే శనీశ్వరుడిని సప్తనామావాలి పఠించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుంది...సేకరణ...🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment