Adsense

Thursday, July 22, 2021

🌹ఓం గురు దేవాయ నమః🌹 అక్షర సత్యాలు🌻

🌹ఓం గురు దేవాయ నమః🌹                           అక్షర సత్యాలు🌻
 *🪀 అన్నీ తెలిసి ఊరక వుండే వాడు దేవుడు.. ఏమీ తెలియక వూగిసలాడేవాడు జీవుడు...!!* 

 *🪀 న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే కానీ.. గెలిచిందంతా న్యాయం కాదు...!!* 

 *🪀 నీలో నీతి బలంగా ఉంటే నువ్వు ఎదుటివారిని మార్చగలవు.. లేకపోతే వారు నిన్ను మారుస్తారు...!!* 

 *🪀 నీవు పోగొట్టుకున్న దాని విలువ నీకు మాత్రమే బాగా తెలుస్తుంది.. అదే నీవు పొందిన దాని విలువ నీకంటే లోకానికి ఎక్కువగా అనిపిస్తుంది...!!* 

 *🪀 భగవంతుని వైపు నీవు ఎంతగా పయనిస్తావో ఆయన నీకు అంతగా పని తగ్గిస్తాడు...!!* 

 *🪀 నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీ వేంటో తెలుస్తుంది. ఒకవేళ పరాజయం పొందితే నీ శ్రేయోభిలాసు లెవరో నీకు తెలుస్తుంది...!!* 

 *🪀 నేర్చుకోవడం ఎప్పటికీ ఆపవద్దు. ఎందుకంటే ఈ జీవితం నేర్పడం ఎప్పటికీ ఆపదు...!!* 

 *🪀 అవకాశాలున్నా, పరిస్థితులు అనుకూలంగా  వున్నా పొరపాట్లు చేయకుండా వుండేవారే ఉత్తములు...!!*

     *||సర్వేజనా సుఖినోభవంతు||*
🙏🙏🌹 🌹❤🌹 🌹🙏🙏

No comments: