Adsense

Tuesday, July 27, 2021

అష్టైశ్వర్యాలు అనుగ్రహించేశ్రీ స్వర్ణాకర్షణ భైరవుడు SWARNAAKARSHAKA BHAIRAVUDU


 స్వర్ణాకర్షణ కాలభైరవ చిత్రపటం శని దోషం ఉన్నవారు, శని దశ, ఏల్నాటి శని ఉన్నవారు, పనులు ఆటంకాలు కలుగుతున్నవారు, శని సంబంధ వృత్తి, ఉద్యోగాలలో రాణించాలనుకునేవారు, ధనాభివృద్ధి కొరకు పూజా మందిరంలో ప్రతిష్టించుకొని పూజించు వారికి ధనాభివృద్ధితో పటు, శని బాధల నుండి విముక్తి కలుగుతుంది. పిల్లలకు చదువులో శ్రద్ధ తగ్గుతున్న, దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, దీర్ఘకాల సమస్యలు ఉన్నవారు కాలభైరవ రూపు ధరించటం మంచిది

🌹🙏" స్వర్ణవర్ణం చతుర్బాహుం 
త్రినేత్రం పీతవాససం 
స్వర్ణ పాత్రధరం వందే 
స్వర్ణాకర్షణ భైరవం "🙏🌹

పరమేశ్వరుని మరొక రూపమే శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం చూడడానికి ఎర్రటి చాయతో ప్రకాశిస్తూ ఉంటారు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడిని ధరించి. చతుర్భుజాలతో. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు

కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ఫ్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ! అని శివరాత్రికి మనవూళ్ళో గుళ్ళో పాటతో కాలభైరవుడి పరిచయం అవుతుంది. కాలభైరవుడు వారణాసికి క్షేత్రపాలకుడుగా కీర్తించబడ్డాడు. మంత్ర తంత్ర సాధనల్లో ఏం సాధించాలన్నా ముందు ఆయన అనుమతి తీసుకుంటారు. సాక్షాత్తూ శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెపుతున్నాయి. అనేక దేవాలయాల్లో కాలభైరవ విగ్రహం వుంటుంది, ఆయన క్షేత్రపాలకుడిగా, గ్రామ నగర రక్షకుడిగా, మంత్ర శాస్త్ర వ్యాఖ్యాతగా, తంత్ర మూర్తిగా మనకి తెలుసు. కాలమే జగన్మూలం. ఆ కాలరూపుడే కాలభైరవుడు. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలని అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవోపాసనతో సాధ్యం

🙏కుర్తాళం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు అనేక సంవత్సరాలు కాలభైరవ సాధనచేసినట్లు ఆ పీఠంలో ఆ సమయంలో వున్న సాధకులు తెలిపారు. కాలభైరవుడ్ని నేపాల్ ప్రాంతాల్లో, హిమాలయాల్లో ఎంతగానో పూజిస్తారు. ఖాట్మండు నగర మధ్యంలో వున్న కాలభైరవ మూర్తి చాలా దశాబ్దాలు నేపాల్ సుప్రీం కోర్టుగా పరిగణించబడేది. ఆ విగ్రహం ముందు ఎవరైన అబద్దం చెపితే సజీవులై వుండలేరని నమ్మకం. ఇటువంటిదే కాణిపాకంలో వినాయకుని గురించి కూడా మనం వినవచ్చును. ఆధునికయుగంలోనూ కొన్ని కొన్ని విశేషాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆయన పేరుకి తగ్గట్టు ధన సమృద్ధిని, ఋణ విముక్తిని ఇస్తాడు. అన్నిటికన్న ముఖ్యం జ్ఞాన వైరాగ్యాలకి ఆయనే అత్యంత సన్నిహితుడు, కారకుడు

కాలభైరవుని స్తోత్రాలు, మంత్రాలూ, ఎన్నో ఉన్నాయి,  ఏ స్తోత్రం పఠించినా అద్భుతమైన ఫలితాలు, కాలభైరవుని అనుగ్రహము కలుగుతుంది. అటువంటి స్తోత్రాలలో మరొక మహామహిమాన్వితమైన స్తోత్రం
స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments: