Adsense

Tuesday, July 6, 2021

🎻🌹🙏*నిమ్మకాయల మాలను హనుమంతుడికి సమర్పిస్తే..?*

🎻🌹🙏*నిమ్మకాయల మాలను హనుమంతుడికి సమర్పిస్తే..?* 

రాహు, శని దోషాలను తొలగించుకోవాలంటే.. మంగళ, శనివారాల్లో వడమాలను హనుమంతునికి సమర్పిస్తే సరిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. 

ఆంజనేయునికి వడమాల సమర్పించడం, నిమ్మకాయల మాలను సమర్పించడం, తులసీ మాలను అర్పించడం, పూల మాలను నివేదించడం ద్వారా ఈతిబాధలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మంగళ, శనివారాల్లో నిమ్మకాయల మాలను, వడమాలను ఆంజనేయునికి సమర్పించడం ద్వారా శని గ్రహ దోషాలు తొలగిపోతాయి. 
 
పూర్వం నవగ్రహాల్లో క్రూరుడిగా పేరున్న రాహువు, శని ఆంజనేయుని వద్ద ఓటమి చెందారు. ఆ సమయంలో ఆంజనేయుడు భూలోకంలో ప్రజలు శని, రాహువు ఇబ్బందులు ఎదుర్కొంటే.. రాహువుకి ఇష్టమైన మినపప్పును, శనికి నచ్చిన నువ్వుల నూనెతో వడలను తయారు చేసి.. వాటిని మాలగా కూర్చి..తనకు సమర్పించే వారికి దోషాలుండవని వరమిస్తాడు. 

అందుకే శనీశ్వరుడు, రాహువు బారి నుంచి తప్పుకోవాలంటే.. ఆంజనేయునికి వడమాల సమర్పించడం ఐతిహ్యమని పండితులు చెప్తున్నారు. ఆంజనేయుడు పుట్టింది శనివారమేనని.. ఆ శనివారానికి శనీశ్వరుడు అధిపతి కావడంతో ఆ రోజున హనుమంతుడిని పూజిస్తే శనిదోషాలుండవని పండితులు చెప్తున్నారు..సేకరణ..💐🙏

🚩 జై శ్రీరామ్...🌞🙏🌹🎻

No comments: