Adsense

Monday, July 19, 2021

🎻🌹🙏ఆషాడ ఏకాదశి ముందు చేసే శ్రీమహాలక్ష్మీవ్రతం..

🎻🌹🙏ఆషాడ ఏకాదశి ముందు చేసే శ్రీమహాలక్ష్మీవ్రతం..
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

శ్రీమహాలక్ష్మీ వ్రతం ఆచరించే విధి 
వ్రతకల్పంలోను, ధర్మశాస్త్రంలోను ఉంది. ఈ వ్రతం ఆషాఢ శుద్ధ దశమి రోజున ఆచరిస్తారు. దీన్ని ఆచరించడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుందంటారు.

లక్ష్మీ అనే పదం మనకు రుగ్వేదఖిలకాండలోని శ్రీసూక్తంలో వినవస్తుంది. ఆ సూక్తమే లక్ష్మీదేవి పంచభూతాత్మకమైన ఈ ప్రకృతికి మూలమని తెలుపుతోంది. ‘జగత్తు అంతా వ్యాపించిన విష్ణువు లాగే ప్రపంచమంతా శ్రీమహాలక్ష్మీ వ్యాప్తమైంది’ అని విష్ణు ధర్మోత్తర పురాణ వచనం. ఏ విధమైన సంపద కోసమైనా లక్ష్మినే అర్చిస్తారు. సకల సంపదలకు అధిష్ఠాత్రి శ్రీ మహాలక్ష్మి. సాక్షాత్తు విష్ణుమూర్తి స్కాంద పురాణంలో మహాలక్ష్మి గురించి చెబుతూ, ‘సంసార సాగరంలో మునిగిపోయేవారు నన్ను పొందడానికి లక్ష్మీదేవిని కటాక్ష రూపిణిగా మహర్షులు నిర్ణయించారు. ఇది నాకూ సమ్మతమే. లక్ష్మి పట్ల విముఖత చూపేవారు నాకూ ద్వేషులే’ అంటాడు.

తొలి ఏకాదశికి ముందు రోజున వచ్చే ఈ పర్వదినం శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైంది. ఈ రోజున వ్రతం చేసి, కథ చెప్పుకొని, శాస్త్రోక్తంగా దానధర్మాలు చేసే వారింట లక్ష్మి స్థిరనివాసం ఏర్పరచుకుని, కుటుంబ సభ్యులందరినీ అనుగ్రహించి, సకల సంపదలను శాశ్వతంగా ఇచ్చి, సుఖశాంతులను ప్రసాదించి, మోక్షానికి అర్హత కలిగిస్తుందని వ్రత ఫలశ్రుతి చెబుతోంది. ‘జ్ఞానం, ఐశ్వర్యం, సుఖం, ఆరోగ్యం, ధనం, ధాన్యం, జయం... మొదలైనవన్నీ లక్ష్మీ శబ్దానికి నిర్వచనాలే’ అని వేద నిరుక్తసారం చెబుతోంది....🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: