🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
రామాయణం ప్రకారం సీతా దేవిని రావణుడు అపహరించిన ప్రదేశం పంచవటి.. సీతా రాములు పినతల్లి కైకేయి కి ఇచ్చిన మాట నెరవేర్చడానికి, తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసానికి వెళతారు..
ఆ సమయంలో నాసిక్ లోని గోదావరీ తీరానికి చేరుకొన్న వారు అగస్త్య మహాముని సూచన మేరకు ఈ ప్రాంతంలో పర్ణ కుటీరం నిర్మించుకుని నివసించారు.. ఇక్కడే లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఉందని కధనం... అయితే ఈ స్థలానికి పంచవటి అని పేరు రావడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక్కడ ఐదు పెద్ద పెద్ద చెట్లు వున్నాయి. వీటినే పంచవటి గా పిలుస్తారు. ఆ చెట్లకి 1, 2, 3, 4, 5 అని నంబర్లు కూడా వేసి ఉంచారు.
1. వట_వృక్షం: (మర్రిచెట్టు)
వటవృక్షం కింద ప్రార్థనలు చేయటం అనాది కాలం నుంచి వస్తోంది.. ఈ వృక్షాన్ని విష్ణుమూర్తి అంశగా భావిస్తారు. అందుకే స్వామికి వటపత్రశాయి అని పేరు. కురుక్షేత్రం లో శ్రీకృష్ణుడు గీతను బోధించింది కూడా వటవృక్ష సమీపంలోనే...! కురుక్షేత్రంలో దాదాపు అయిదువేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ వృక్షం నేటికీ దర్శనమిస్తుంది.
2. బిల్వ_వృక్షం: (మారేడు చెట్టు)
బిల్వపత్రాలతో శివుని పూజిస్తారు.. బిల్వవృక్షం సాక్షాత్తూ శివ స్వరూపమని అంటారు. ఒకానొక సమయంలో శని ప్రభావం నుంచి తప్పించుకునేందుకు సాక్షాత్తూ ఆ మహాదేవుడే ఈ మారేడు చెట్టుగా మారి అజ్ఞాతంగా ఉన్నాడని పురాణాలూ చెబుతున్నాయి... అందుకే బిల్వ పత్రాలతో శివుని పూజించిన వారిపై శని ప్రభావం ఉండదని భక్తులు నమ్ముతారు.. ఆనాటి నుంచి నేటికీ పరమేశ్వరుడిని బిల్వపత్రాలతో అర్చన చేయటం ఆనవాయితీగా వస్తుంది.
3. అశ్వత్థ_వృక్షం (రావి చెట్టు)
పలు దేవతామూర్తులు అశ్వత్థవృక్షం నీడలోనే అరాధనలు అందుకుంటాయి.. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది కూడా ఈ వృక్షం కిందే. అందుకే దీనిని బోధివృక్షం అని కూడా పిలుస్తారు. బౌద్ధ భిక్షువులకు ఇది అత్యంత పవిత్రమైంది. తొలిరోజుల్లో గౌతమబుద్ధుడి పాదముద్రలు, చిహ్నాలను, పాదుకలను ఆయన స్మృతులుగా ఈ చెట్టు వద్దే పెట్టి ధ్యానించేవారు.. గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో గ్రామదేవతలు రావిచెట్టు మూలల్లోనే కొలువు తీరటం విశేషం. అందుకే ఈ అశ్వతవృక్షాన్ని ‘స్థలవృక్ష’గా భావిస్తూ ఇక్కడి భక్తులు ఆరాధిస్తారు.
4. నింబ_వృక్షం (మేడి చెట్టు)
5. ఆమ్లాక_వృక్షం: (ఉసిరి చెట్టు)
నదీ స్నానాల్లో, నదీ పూజల్లో దీపారాధానకు ఉసిరికి ప్రత్యేక స్థానం.. వీటి మధ్యలో దీపాన్ని పెట్టి వెలిగించటం ఆనవాయతీ...
ఈ అయిదు వృక్షాలు ఆధ్యాత్మికంగానే కాదు.., ఆరోగ్యపరం గానూ ప్రయోజనకరం. అందుకే పంచవటి పారమార్థిక సాధనలో అంత ప్రాధాన్యం సంతరించుకుంది...సేకరణ..🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment