ఒకొక్క నక్షత్రం నాడు వెంకటేశ్వరస్వామిని ఆనంద నిలయంలో దర్శిస్తే ఒక్కొక్క ఫలితం యుండును.🙏
అశ్వని:- నాడు శ్రీనివాసుని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యం అయినా నశిస్తుంది . 🙏
భరణి :- అపమృత్యభయం తొలగిపోవును . 🙏
కృత్తిక :- చక్కటి చదువు లభిస్తుంది . జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు . 🙏
రోహిణి:- అన్నీ మానసిక సమస్యలు తొలగి పోవును🙏
మృగశిర:- సర్వ శుభాలు కలుగును🙏
ఆరుద్ర:- ఎటువంటి ఆపదలు కుండా చేయును. 🙏
పునర్వసు:- ఆర్థిక మానసిక సమస్యలు తొలగిపోవును శాంతి సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి🙏
పుష్యమి:- 1000 జన్మల పాపం నశిస్తుంది. 🙏
ఆశ్లేష:- ఈ నక్షత్రానికి అధి దేవత ఆదిశేషుడు ఈరోజు స్వామి ఆనందంలో దర్శించిన శరీరక మానసిక ఎటువంటి సమస్యలైనా నా తొలగిపోవును🙏
మఖా : - అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి . 🙏
పూర్వఫల్గుణ్ ( పుబ్బ ) : - వివాహం ఆలస్యం అవుతున్న వారికి వెంటనే పెళ్ళి నిశ్చయము అగును. 🙏
ఉత్తరఫల్గుణి : - సర్వసౌభాగ్యాలు కలిగి ఎంతో ఐశ్వర్యవంతులు అగుదురు . 🙏
హస్త :- ఎటువంటి అనారోగ్యమైన క్షణంలో తొలగిపోవును . 🙏
చిత్త : - యశస్సు , సకల సంపదలు కలుగును . శరీరం నూతన తేజస్సుతో నిండిపోవును 🙏
స్వాతి :- అపమృత్యు భయం తొలగిపోవును . ఎటువంటి ప్రమాదాలు దరిచేరవు . 🙏
విశాఖ : - యువతీ యువకులకు త్వరలో వివాహము జరిగి మంచి జీవిత భాగస్వామి లభించును.🙏
అనూరాధ : - ఎంతో కాలం నుండి తీరని అప్పులు తీరును . సర్వసౌభాగ్యాలు కలుగును . 🙏
జ్యేష్ఠ : - సర్వ సంపదలు చేకూరుతాయి . ఉన్నత పదవులు లభిస్తాయి . 🙏
మూల : - సర్వ విద్యలు లభిస్తాయి . విద్యార్థులు పరీక్షలలో అద్భుత విజయం సాధిస్తారు . 🙏
పూర్వాషాఢ : -ఎంతో సంపద కలుగును . 🙏
ఉత్తరాషాఢ : - ఎటువంటి అనారోగ్యాలైనా తొలగును . సర్వ సౌభాగ్యాలు కలిగి మానసిక ప్రశాంతత కలుగును . 🙏
శ్రవణం : - స్వామి వారి జన్మ నక్షత్రము . జీవిత కాలం సుఖంగా యుండి చివరన ముక్తి పొందుదురు.🙏
ధనిష్ఠ - దేనికి లోటు లేకుండా జీవితం సాఫీగా జరిగిపోవును . ఎంతో కాలంగా రావలసిన సొమ్ము వెంటనే చేతికి వచ్చును . 🙏
శతభిషం : - కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి . సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండును 🙏.
పూర్వభాద్ర : - ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరుతాయి. 🙏
ఉత్తరాభాద్ర : -చక్కటి సంతానము కలుగును . 🙏
రేవతి : - ఎటువంటి అనారోగ్యమైనా క్షణాలలో తొలగును . సంపూర్ణ ఆరోగ్యము కలుగును . 🙏
ఈ విధంగా ఆయా నక్షత్రములు గల రోజులలో శ్రీ వేంకటేశ్వరుని ఆనంద విలయంలో దర్శించి స్వామి అనుగ్రహంతో సర్వ శుభాలు పొందుదాం . జీవితం సుఖమయం చేసుకుందాం.
No comments:
Post a Comment