Adsense

Tuesday, August 24, 2021

హనుమంతుడు - బుషుల శాపము


 
హనుమంతుడు బాల్యంలో చాలా అల్లర్లు చేయు చుండెడీవాడు. అసలే వానరుడు, అదియును గాక దేవతల వలన పొందిన వరబలము తోడునీడై ఉన్నది, ఇవన్నియు అటులుంచగా రుద్రాంశతో ఆవిర్భవించినాడు. 

హనుమంతుడు ఋషుల ఆసనములను తీసుకొనిపోయి చెట్ల కొమ్మలకు వ్రేలాడ తీసెడివాడు. వారి కవుండలోదకములను పారబోసెడివాడు.. వారి అంగ వస్త్రములను చింపి పారవైచెడివాడు. అప్పుడప్పుడు ముద్దుగా వారి, తొడలయందు కూర్చొని హఠాత్తుగా వారి గెడ్డములనూ, మీసములనూ  పీకి పారిపోవుచుండెడివాడు. బలాత్కారముగా అతనినెవరూ ఆపలేరు కదా; హనుమంతుడు పెద్దవాతగుచుండెను. 

విద్యాభ్యాసవయసు వచ్చినది. కాని అతని బుర్దీ చాపత్యములో మాత్రము మార్పు రాలేదు. అంజనా కేసరులు విచారములో మునిగిపోయినారు. వారు తమకు తోచిన అనేక రీతుల ప్రయత్నించిరి. కాని హనుమంతుడు దారిలోనికి రాలేదు.

అప్పుడువారు మహర్షుల నాశ్రయించి - “మహానుభావులారా! 
మీరు దయజూపవలెను, లేనిచో మా కుమారుడు జాగుపడడు” 
అనిరి. అంత మహర్చులు దివ్యదృష్యా యోచించి- 

“ఇతనికి తన బలముపై మహాగర్వమున్నది స్వశక్తిని మరచిననే కాని ఇతడు దారిలోనికి రాజాలడు" అని నిశ్చయించుకొని,

అవకాశమున హనుమంతుని శపించుచూ- “నీవు నీ స్వబలమును మరచి పోయెదవుగాక, ఎవరైననూ ఎప్పుడు నీ బలపౌరుషములను గరించి నీ స్మరణకు తెచ్చెదరో, అప్పుడే నీవు నీ బలమును' స్మరించుకుని న్వశక్తిని నద్వినియోగము చేసికొవెదవుగాక ” అనుటతో, హనుమంతుడు తన బలమును తాను మరచిపోయెను. 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

No comments: