💦మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కాదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది.
💦అయితే బ్రహ్మ నుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడంట. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాసారంట. అర్చనలు, ఉపాసనలు కర్మఖాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడతున్నాను అని తెలిపారు.
💦ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే, ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆవ్యక్తి ఆయువు తగ్గుతుంది. ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు. పురాణాలు శ్రద్దగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది.
💦పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు, ఇతనికి 50 వ ఏట మరణ గండం ఉంది. ఆ మరణ గండాన్ని ఎవ్వరు తప్పించలేరని రాసాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసినవాడు బ్రతికాడు.
💦జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి జాతక రీత్యా వీడు చచ్చిపోవాలండి, కాని బ్రతికాడని అనుకుంటే… అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నాడు… ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికి గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయట పడ్డాడని చెప్పాడు.
💦కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు గాని, మనం ఇలా పురాణాలను శ్రద్దగా వినడం, మంత్రాలను చదవడం, ప్రదక్షణలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది అని చెబుతారు.
💦ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండిటిని స్మరించాలి. అమ్మ పాదాలను స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది.
💦128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు, ద్రౌపతిని జుట్టుపట్టి దుశ్యాసునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60 వ ఏట చనిపోయాడు. కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ, బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు. అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికినవాళ్ళు ఉన్నారు.
💦అందుకని ఏ కష్టం వచ్చిన బ్రహ్మ నాకు ఇలా రాసాడు అని కృంగిపోకుండా… ఆ రాతను మార్చుకోవడానికి పూజలు, దానాలు, ధర్మాలు, పేదలకు సహాయం చెయ్యండి...స్వస్తి..సేకరణ🙏
*ఓం నమః శివాయ*
No comments:
Post a Comment