🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌸వారంలో మన ఇష్ట దైవం కు ఇష్టమయిన వారం రోజునో, లేక ఏకాదశి రోజునో, లేక పర్వదినం రోజునో సాధారణంగా అందరం ఉపవాసాలు చేస్తువుంటాము.
🌸 అయితే ఇలా ఉపవాసం చేసేటప్పుడు ఎటువంటి పదార్దాలను తినాలి ఎటువంటి పదార్దాలను తినకూడదు అనే సందేహం సాధారణంగా అందరికి వస్తు వుంటుంది.
🌸ఉపవాసం రోజున అన్నం తినకూడదు.' పండ్లు, నువ్వులు, పాలు, నీరు, నేయి, పంచగవ్యము, వాయువు' మాత్రమే భుజించాలి.
🌸 వీటిలో ఒకదానికంటే ఒకటి శ్రేష్టం (గాలిని భుజించడం అన్నిటికన్నా శ్రేష్టం). పై పదార్దాలు తినవచ్చు అన్నారుకదా అని కడుపునిండా తినకూడదు. మితంగా భుజించాలి.
🌸వ్రత సంభందిత ఉపవాసాలను వైశ్య, శూద్రులు రెండు రాత్రులకంటే ఎక్కువ ఆచరించరాదు. ఇతరులను అనుసరించాలని మూడు లేదా ఐదు రాత్ర్లు చేసినప్పటికీ ఫలితం వుండదు. స్కాంద పురాణం ప్రకారం స్త్రీలకు భర్త సేవకంటే యజ్ఞం గాని ఉపవాసం కాని వ్రతం కాని లేవు.
🌸భర్త ఆచరించే సకల పుణ్య కార్యాలలో పతివ్రత అయిన భార్యకు సగం ఫలితం లభిస్తుంది. భర్త అనుమతి లేకుండా చేసే వ్రతమయినా,వుపవాసమయినా ఫలితం వుండదు.
🌸వుపవాసానికి కుడా సంకల్పం చెప్పుకోవాలి. ఒక రాగి పాత్ర నిండా నీటిని తీసుకుని, తూర్పు దిక్కుకి తిరిగి నిలబడి తాను ఆ ఉపవాసాన్ని ఏది కోరి ఆచరిస్తున్నాడో సంకల్పం చెప్పుకుని ఉపవాస దీక్ష స్వీకరించాలి...సేకరణ..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment