Adsense

Wednesday, September 1, 2021

కామాక్షీ దీపం


కామాక్షీ దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మీ చిత్రం ఉంటుంది. ఈ దీపానికి గజలక్ష్మీ దీపం అనికూడా పేరు. ఆ దీపపు వెలుగులో కామాక్షీ దేవి నిలిచి ఉంటుంది. కనుక కామాక్షీ దీపం అంటారు.
☘☘☘☘☘☘
కామాక్షీ దేవి సర్వదేవతలకూ శక్తినిస్తుందని ప్రతీతి. అందుకే కామాక్షీ కోవెల తెల్లవారుఝామున అన్ని దేవాలయాలకన్నా ముందే తెరువబడి. రాత్రి పూట దేవాలయాలన్నీ మూసిన తరువాత మూయబడుతుంది. అమ్మవారి రూపమైన కామాక్షీ దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది.
☘☘☘☘☘
కామాక్షీ దీపాన్ని చాలామంది ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటారు. తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం హిందువుల ఇళ్ళలో ఉండే ఆచారం. 
☘☘☘☘☘
కామాక్షీదీపం ఇళ్ళలో వ్రతాలూ పూజలూ చేసుకునేటప్పుడూ, అఖండ దీపాన్ని పెట్టదలచుకున్నప్పుడూ గృహప్రవేశం చేస్తున్నప్పుడూ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కామాక్షీ దీపము కేవలం ప్రమిదను మాత్రమేకాకుండా అమ్మవారి రూపునూ కలిగి ఉంటుంది.
☘☘☘☘🍀
ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షీ దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం.
☘☘☘☘☘
కామాక్షీ దీపం వెలిగించినప్పుడు పాటించవలసిన నియమాలు
దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ పెట్టడం ఆచారం. 
☘☘☘☘☘☘
కామాక్షీ దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికీ కుంకుమ పెట్టి, పువ్వు తో అలంకరించి, అక్షతలు వేసి నమస్కరించుకోవాలి.
 🙏🏻🙏🏻💐💐🙏🏻🙏🏻

No comments: