Adsense

Sunday, August 15, 2021

పెద్దల మాట చద్ది మూట అని ఎందుకు అంటారో రామాయణం చూస్తే తెలుస్తుంది.

 
👉 నరుడు గా పుట్టిన శ్రీరామచంద్రమూర్తి పెద్దల మాట వినడం తో దేవుడుగా ఎలా కీర్తించబడుతున్నాడో చూడండి.

👉 రామావతార సారం మొత్తం పెద్దల మాట వినుటమే.

👉 రాముడు మంచి బాలుడు , చెప్పినమాట వింటాడు 

👉 దేవతలు కోరితే అవతరించాడు.

👉 విశ్వామిత్రుడి మాట మేరకే ఆయనతో వెళ్ళాడు. 

👉 విశ్వామిత్రుని మాట మేరకే తాటకిని సంహరించాడు. 

👉 ఆయన మాట మేరకే యజ్ఞాన్ని కాపాడాడు, ఆయన ఆజ్ఞ ను అనుసరించి మిథిలా నగరానికి బలయలు దేరి, అహల్యను శాపవిమోచనం గావించి, ఆయన మాటమేరకే శివ ధనుర్భంగం చేసాడు

👉 దశరధుడు చెప్తేనే సీతమ్మవారిని వివాహం చేసుకున్నాడు. 
👉 తండ్రి మరియు కైక ఆజ్ఞతో అరణ్యానికి బయలుదేరాడు.

👉 భరద్వాజుని ఆజ్ఞతో చిత్రకూటంలో నివాసం ఏర్పరుచుకున్నాడు,

👉 చిత్రకూటంలో కులపతి ఆజ్ఞతో అక్కడినుంచి బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళాడు .

👉 దండకారణ్యంలో సుతీక్షుని ఆజ్ఞతో అక్కడ ఋషుల ఆశ్రమాలు దర్శించాడు, అగస్త్య ముని ఆజ్ఞతో పంచవటికి బయలుదేరాడు,

👉 పంచవటిలో జటాయువు నిర్దేశంతో ఆశ్రమం నిర్మించుకున్నాడు. కబంధ్ని, శబరి ఆజ్ఞతో సుగ్రీవుడితో స్నేహం చేసి.

👉 సుగ్రీవుని మాటతో వాలిని చంపాడు,
సుగ్రీవుని మాటతోనే హనుమంతాదులను సర్వదిక్కులకూ పంపాడు.

👉 హనుమంతుడు చెప్పినదాన్ని బట్టి, సుగ్రీవుని సలహామేరకూ యుద్ధానికీ బయలుదేరాడు,

👉 విభీషణుని సలహా మేరకూ సముద్రున్ని శరణు వేడాడు,

👉 సముద్రుని మాటమేరకూ సముద్రానికి వారధి కట్టాడు.

👉 రామ రావణ యుద్ధంలో కూడా మాతలి చెబితే రావణున్ని చంపాడు. 

👉 అగ్నిహోత్రుడు చెబితే సీతమ్మవారిని స్వీకరించాడు,

👉 భరద్వాజుడు చెబితే అయోధ్యకు మళ్ళీ వెళ్ళాడు,

👉 యమధర్మరాజు చెబితే అవతారాన్ని చాలించుకున్నాడు.

👉 చూసారా....
నరుడుగా వచ్చాడు కనుక, నరులకు పెద్దల మాట వేదవాక్కు లా ఆచరించాలి కనుక...ఆ " ధర్మాన్ని" ఖచ్చితంగా పాటించాడు కనుక ఆదర్శమూర్తి గా , దేవుడిగా పూజింపబడుతున్నాడు. 

జై శ్రీ రాం.

No comments: