Adsense

Wednesday, August 18, 2021

వారానికి ఒక్కరోజు మాత్రమే దర్శనం కల్పించే నరసింహ స్వామి ఆలయం ఎక్కడుందో తెలుసా ?



👉 మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. 
ఈ పుణ్య క్షేత్రాలలో నరసింహస్వామి ఆలయాలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందినవని చెప్పవచ్చు. ఈ విధంగా నరసింహ స్వామి తొమ్మిది అవతారాలుగా ఉద్భవించి వివిధ ప్రాంతాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నవ నరసింహలలో ఒకటైన నరసింహుడు తన దేవేరి శ్రీ మహాలక్ష్మీతో పాటు కొలువై ఉండి భక్తుల కోరికలను తీరుస్తూ కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందారు.

👉 ఈ విధంగా నరసింహస్వామి జ్వాలా రూపంలో కనిపించే ఈ ఆలయం కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తారు. 

👉ఈ విధంగా వారంలో ఒకరోజు మాత్రమే భక్తులకు దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏమిటి ?
 👉ఈ నరసింహ స్వామి ఆలయం ఎక్కడ ఉంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...

👉 ప్రకాశం జిల్లా, వలేటివారి పాలెం మండలంలో మాలకొండ పై జ్వాలా నరసింహ స్వామి కొలువై ఉన్నారు.
సాధారణంగా అన్ని ఆలయాలు ఉదయం సాయంత్రం భక్తులకు దర్శనం కల్పిస్తే ఈ ఆలయంలో మాత్రం స్వామి వారి దర్శనం కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే కలుగుతుంది. 

👉ఈ విధంగా వారానికి ఒక్కసారి మాత్రమే స్వామి దర్శనం కావడానికి వెనుక పురాణ కథ ఉంది. 

👉పురాణాల ప్రకారం సాక్షాత్తు లక్ష్మీ దేవత విష్ణు భూలోకంలో ఈ ప్రాంతంలో కొలువై ఉండి భక్తులను దర్శనం ఇవ్వాలనే కోరిక కోరడంతో స్వామివారి ఇక్కడ అ కొలువై ఉన్నారని చెబుతారు. 
అదేవిధంగా అగస్త్య మహాముని తన దివ్య దృష్టితో తాను తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలం మాల్యాద్రి కొండ అని భావించి ఈ కొండపై వచ్చి స్వామివారిని సేవించారు. 
ఈ క్రమంలోనే స్వామివారు ఆగస్త్య మహామునికి సంధ్యా సమయంలో ఎర్రని రంగు, ఎర్రని పీతాంబరంలు, ఎర్రని ఆభరణాలతో స్వామివారు కనిపించాడు కనుక ఇక్కడ వెలసిన స్వామివారిని జ్వాలా నరసింహుడిగా పిలుస్తారు.

👉ఈ క్రమంలోనే అగస్త్యమహాముని భూలోక వాసుల పాపాలు పటాపంచలు చేసి వారిని రక్షించాలని అందుకు ఇదే ప్రదేశంలోనే జ్వాలా నరసింహుడిగా శాశ్వతంగా కొలువై ఉండాలని కోరాడు. అదేవిధంగా మునులు, దేవతలు, యక్షులు, కిన్నెరలు వంటి వారికి ప్రతిరోజు దర్శనం కల్పించే, మానవులకు ప్రతి శనివారం మీ దర్శనం కలిగేలా వరం ఇవ్వమని కోరడంతో స్వామి వారు అగస్త్యుని కోరిక మేరకు వారంలో ఒకరోజు అంటే ప్రతి శనివారం భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

👉 ఇక అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి భక్తులు ప్రతి శనివారం మాల్యాద్రి కొండ పైకి ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.
 ఈ కొండపై వెలసిన స్వామి వారి దర్శనం చేసుకుంటే వారి పాపాలు తొలగిపోయి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

No comments: