Adsense

Monday, August 16, 2021

శ్రావణ సోమవారం


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

శివునికి శ్రావణ మాసం చాలా ఇష్టమైనది పురాణాలననుసరించి మనకు తెలిసిన విషయమే...
చాలామంది శ్రావణ మాసంలో సోమవారాలకు, శుక్రవారాలకు, చాలా ప్రాముఖ్యత ఇస్తారు,
కొంతమంది సోమవారం రోజున ,  సోమవారపు వ్రతం అని ఆచరిస్తారు...
శ్రావణమాసంలో ఈ సోమవారపు వ్రతాన్ని పాటిస్తే చాలా శుభాలు కలుగుతాయని పురాణాలు చెపుతున్నాయి. 

శ్రావణ సోమవారపు వ్రతాన్ని సూర్యోదయానికి ముందు ప్రారంభించి సాయంత్రం వరకు పాటిస్తుంటారు...
శివుని అభిషేకం మరియు పూజ చేసిన తర్వాత సోమవారపు కథను వినడం తప్పనిసరి. 
పూజాదికార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ మంత్రం పఠిస్తూ సంకల్పం చేసుకొంటారు...

*'మమ క్షేమస్థైర్యవిజయారోగ్యైశ్వర్యాభివృద్ధయర్థం సోమవ్రతం కరిష్యే '*

ఆ తర్వాత క్రింది మంత్రాన్ని ధ్యానించాలి...

*"ధ్యాయేన్నిత్యంమహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నాకల్పోజ్జవలాంగ పరశుమృగవరాభీతిహస్తం ప్రశన్నం I*

*పద్మాసీనం సమంతాత్స్తుతమమరగణైర్వ్యాఘ్రకృతిం వసానం విశ్వాద్యం విశ్వవంద్యం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రమ్ II "* 

ధ్యానం తర్వాత *"ఓం నమఃశివాయ"* తో శివునికి మరియు *"ఓం నమఃశివాయై"* తో పార్వతీదేవిని షోఢశోపచారాలతో పూజించండి. పూజ పూర్తయిన తర్వాత వ్రతానికి సంబంధించి కథను వినండి. 
ఆ తర్వాత భోజనం లేదా ఫలహారం సేవించాలి...
శ్రావణ సోమవారపు వ్రతాన్ని నియమానుసారం పాటిస్తే ఆదిదంపతులైన శివపార్వతుల కృపాకటాక్షాలు లభిస్తాయి. 
జీవితం ధన్యమవుతుంది, ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంటాయని నమ్మకం... భక్తుల కష్టాలు కూడా హరింపబడుతాయని పురాణాలు చెపుతున్నాయి...🚩🌞🙏🌹🎻

 *🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏*

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: