👉 ఏవరైతే నియమములను పాటించుదురో, స్వామియందు ప్రేమానురాగములు కలిగియుందురో వారే అర్హులు.
👉 స్త్రీలలో 5 సంవత్సరముల నుండి 11 సంవత్సరముల వరకు,
50 సంవత్సరములు దాటిన వారు అర్హులు.
👉కుటుంబములో తల్లి, తండ్రి చనిపోయినచో ఏడాది కాలము, భార్య చనిపోయినచో ఆరు మాసములు దీక్ష తీసుకొనరాదు.
👉 సోదరులు, పుత్రులు, పెదనాన్న, చిన్నాన్న వర్గీయులు మరణించినచో 41 దినములు, అల్లుళ్ళు, మేనత్తలు, మేనమామలు, తాత, బామ్మ మున్నగువారు మరణించినచో 30 దినములు దీక్ష తీసుకొనరాదు. దాయాదులు, కూతురు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, మనమళ్ళు, మనవరాళ్ళు, మరదళ్ళు, వదినలు మరణించినచో 21 దినములు దీక్ష తీసుకొనరాదు. రక్తసంబంధీకులు, వియ్యలవారు మరణించినచో 13 దినములు తీసుకొనరాదు. ఆత్మీయులు, మిత్రులకు మూడు దినములు దుఃఖమనుష్టించిన చాలును. తన తల్లి, భార్య, కూతురు, కోడళ్ళు, మరదళ్ళు ఏడవ నెల గర్భిణి అయినచోతాము మాల ధరించరాదు.
No comments:
Post a Comment