🌺 దర్భ 🌺
పూర్వం గరుత్మంతుడు తన తల్లి వినతకు సవతితల్లి కద్రువ వద్ద సంభవించిన దాస్యం తొలగించడానికి, కద్రువ కొడుకులు=కోరినట్లు అమృతభాండం అపహరించ్రుకొనిపోతున్న గరుదునితో పోరాడి దేవేంద్రుడు గూడా పరాజితు డయ్యాడు. ఆ పై అమృతం కద్రువ కొడుకులైన సర్పాలు త్రాగకుండా వుండేటట్లు ఇంద్రునితో సమాలోచన జరిపి అమృతభాండంతో సహా కద్రువ కొడుకుల చెంతకువచ్చాడు. ఆ భాండాన్ని దర్భలపై ఉంచాడు. మీరు స్నానర్ని అలంకరణం చేసుకొని వచ్చి ఈ అమృతం సేవించండి అని వారితో చెప్పాడు.
ఆ సర్పాలు అమృతపాన కుతూహలంతో స్నానానికి పోయాయి. ఇంతలో ప్రచ్చన్నంగా దాగివుండిన ఇంద్రుడు భాండం తీసుకొని అమరావతి చేరు కొన్నాడు. స్నానం చేసివచ్చిన కాద్రవేయులకు భాండం కనిపించలేదు. భాండం ఉంచిన దర్భలను నాకగా వారి నాలుకలు రెండుగా చీలిపోయాయి. అమృత భాండస్పర్శవల్ల దర్భలు పవిత్రాలయ్యాయి. అట్టి దర్భలను శుభకార్యాలలో వాడుతున్నాం. శుభకార్యాలు దర్భతో జరిపిస్తారు.
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
No comments:
Post a Comment