Adsense

Tuesday, August 3, 2021

జై సంతోషి మాత Jai Santoshi Mata

జై సంతోషి మాత
⚜️🚩 ఒక చేత "ఖ‌డ్గం"తో, మ‌రోచేత "త్రిశూలం"తో ఉండి సింహారూఢినిగా సంచ‌రించే రూపం...  
"సంతోషి మాత"🙏

⚜️🚩 ఉత్తరాదిన వినిపించే గాథ‌ల ప్రకారం సంతోషి మాత "వినాయ‌కుని" కుమార్తె. 
ఒక "ర‌క్షాబంధ‌నం" రోజున అన్నద‌మ్ములంద‌రూ, అక్కచెల్లెళ్లతో రాఖీ క‌ట్టించుకుంటున్నార‌ట‌. 
ఆ దృశ్యాల‌ని గ‌మ‌నించిన వినాయ‌కుని కుమారుల‌కి చాలా బాధ క‌లిగింద‌ట‌. 
త‌మ‌కి కూడా ఓ చ‌క్కటి "చెల్లెలు" ఉంటే ఎంత బాగుండేదో అనుకున్నార‌ట వాళ్లు. 
నార‌దుడు ఆ పిల్లల కోరిక‌ను తీర్చమ‌ని వినాయ‌కుని కోర‌డంతో... వినాయ‌కుడు, "సంతోషిమాత‌"🙏ను సృష్టించాడు. 
అలా వినాయకుని కుటుంబంలోకి సరికొత్త సంతోషాల‌ను తీసుకువ‌చ్చింది కాబ‌ట్టి, ఆమెను "సంతోషిమాత‌"🙏గా పిల‌వ‌సాగారు. 
కేవ‌లం దేవ‌త‌ల‌కే కాదు, త‌న‌ని కొలిచిన మాన‌వులంద‌రికీ స‌క‌ల‌ సంతోషాల‌నూ ఒస‌గుతుంది కాబ‌ట్టి ఆ పేరు స్థిర‌ప‌డిపోయింది.

⚜️🚩"సంతోషి మాత" వ్రతం

♦️16 శుక్రవారాల‌పాటు ఒంటిపూట భోజ‌నం మాత్రమే చేస్తూ, అమ్మవారిని పూజించాలి. 
ఇందుకోసం పంచ‌భ‌క్ష్యాలు ఏవీ అవ‌స‌రం లేదు. 
ప్రతి  ఇంట్లోనూ ఉండే బెల్లం/ ప‌ంచ‌దార‌, కాసిని శ‌న‌గ‌లు నివేదిస్తే చాలు అమ్మవారు సంతోషిస్తారు. అయితే వ్రతాన్ని ఆచ‌రించే స‌మ‌యంలో 
👉పుల్లటి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం మాత్రం నిషిద్ధం.  

♦️ఇక 16వ శుక్రవారం నాడు 8 మంది బాలుర‌ను భోజ‌నానికి పిలిచి, ఈ వ్రతానికి ఉద్యాప‌న చేయాలి. 

♦️సంతోషిమాత వ్రతాన్ని ఆచ‌రించి స‌క‌ల‌శుభాల‌ను పొందిన స‌త్యవ‌తి అనే భక్తురాలి క‌థ‌ను ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకుంటారు.

⚜️🚩శ్రీ సంతోషిమాత ద్వాదశ నామాలు🙏

1) ఓం శ్రీ సంతోషిన్యై నమః
2) ఓం సర్వానందదాయిన్యై నమః
3) ఓం సర్వ సపత్కరాయై నమః
4) ఓం శుక్రవార ప్రియాయై నమః
5) ఓం శుక్రవార శ్రీ మహా లక్ష్మ్యై నమః
6) ఓం సౌభాగ్యదాయిన్యై నమః
7) ఓం బాలాస్వరూపిన్యై నమః
8) ఓం మధుప్రియాయై నమః
9) ఓం సర్వెశ్వర్యై నమః
10)ఓం సుధాస్వరూపిన్యై నమః
11)ఓం కరుణామూర్త్యై నమః
12)ఓం సుఖప్రదాయై  నమః

⚜️🚩సంతోషిమాత, ల‌క్ష్మీదేవి అవ‌తార‌మ‌ని కొంద‌రంటే... దుర్గామాతకి ప్రస‌న్న రూపమే సంతోషిమాత అని మ‌రికొంద‌రు విశ్వసిస్తారు. 
ఎవ‌రేమ‌నుకున్నా, ఎలా కొలుచుకున్నా సంతోషిమాత స‌క‌ల సంతోషాల‌నూ ఒస‌గుతూనే ఉంది. 
ఎందుకంటే ఆమె భ‌క్తులంద‌రికీ త‌ల్లి క‌దా🙏
   🌷🌷ఓం సంతోషీ మాతృదేవతాయై నమః🌷🌷
               🔱♦️🔱♦️🔱♦️🔱♦️🔱

No comments: