Adsense

Sunday, August 29, 2021

తెలుగు భాషా దినోత్సవం

తెలుగు_భాషా_దినోత్సవం
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

'అ'మ్మ నేర్పిన అజంతా భాష
'ఆ'నందాన్నిచ్చే అనంతమైన భాష
'ఇ'లలో ఇంపైన ఇహపర భాష
'ఈ'స్ట్ ఆఫ్ ది ఇటాలియన్ అనిపించిన భాష
'ఉ'దయకిరణాల వెలుగుల భాష
'ఊ'రించే కమ్మనైన కావ్య భాష
'ఎ'ర్రన కవి ధ్యానించిన పుణ్య భాష
'ఏ'రులై ఉరకలెత్తే ఉషోదయపు భాష
'ఐ'కమత్యాన్ని నేర్పిన ఏకైక భాష
'ఒ'డుపెరిగిన ఒంపైన వయ్యారి భాష
'ఓ'రుగల్లు కోటలో ఒదిగిన భాష
'ఔ'న్నత్యం కలగలిసిన ఔదార్య భాష
'అం'దమైన అభిమాన ఆంధ్రుల భాష
'అ:'- అక్షరాక్రమ పరాక్రమ వీర భాష

'క'వులని కదిలించిన భాష
'ఖ'డ్గ ఖచితాల అఖండ భాష
'గ'ణ గుణాల సుగుణ భాష
'ఘ'నసారపు నిత్యాఘృత తేనె భాష
'ఙ' కంఠ్య నాద ప్రాణ ధ్వని బాష

'చ'తురాసన చరణాల చర్వణ భాష
'ఛ'త్రాధి నేత్ర శరణాల ఛలి భాష
'జ'లజ జగత్ప్రాణువుల జగతి భాష
'ఝ'రముల స్వరముల స్వరాగ భాష
'ఞ' తాలవ్య నాద ప్రాణ ధ్వని భాష

'ట'క్కులు ఎరుగని సంగ్రహ భాష
'ఠ'వరులు ఒక్కాణించిన భాష
'డ'గ్గుత్తిక తో ఢంకా మ్రోగించే భాష
'ఢ'ర్పణ తావుల తంబుర భాష
'ణ' మూర్ధన్య నాద ప్రాణ ధ్వని భాష

'త'రతరాల వర తారుణ్య భాష
'థ'శ్య దిశల కర కారుణ్య భాష
'ద'శమీ నందన వందన భాష
'ధ'న్యులు అవధానించిన భాష
'న'న్నయ కవి నడిపించిన భాష

'ప'రభాషలు కలవరించిన భాష
'ఫ'లాలు ఆశించని ప్రకృతి భాష
'బ'మ్మెర పోతన వారి ప్రగతి భాష
'భ'వదీయులు అందించిన భవిష్య భాష
'మ'హనీయులు మెచ్చి పోషించిన భాష

'య'శస్వీ జయద్వానపు హరివిల్లుల భాష
'ర'మ్యమైన రమణీకృత రంగవల్లుల భాష
'ల'యాత్మక లాస్య లహరుల లేఖ్య భాష
'వ'సంత సమీరపు వసుధైక వారసత్వ భాష
'శ'తకోటి శబ్దశాస్త్ర ఛందస్సుల ఇంధన భాష
'ష'ట్పదముల సందోహ సమ్మోహన సరళ భాష
'స'ఖ్య సంస్కృతీ సాంప్రదాయ సమ్మేళన కళల భాష
'హ'రిద్ర వర్ణ హవణికల సన్మోహన విద్యాధర భాష
'ళ' - కళాత్మక కావ్య ఖండాల ఖండాతర భాష
'క్ష'మాక్షర అక్షర లక్షణ ద్విగుణీకృత దివ్య భాష
'ఱ' - దంతమూలీయ నాద ధ్వని భాష

మన తెలుగు భాష!
"దేశ భాషలందు తెలుగు లెస్స"

నేడు
తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు 
'గిడుగు రామ్మూర్తి' గారి జయంతి!

మిత్రులకు,శ్రేయోభిలాషులకు, పెద్దలకు తెలుగు భాషను అభిమానించే,ప్రోత్సహించే,ప్రతి నిత్యం సంభాషించి,తెలుగు భాషను గౌరవించే ప్రతీ ఒక్కరికీ పేరు, పేరునా మరొక్కమారు..

"తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు"..💐😊🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments: