Adsense

Monday, September 20, 2021

నేడు భాద్రపద పౌర్ణమి ప్రత్యేకత



ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకతను కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజున చేసే పూజాభిషేకాలు వలన లభించే ఫలితం కూడా అధికంగా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 

అలాంటి పౌర్ణమిలలో భాద్రపద పౌర్ణమి మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ రోజున శివపార్వతులను సేవించడం వలన , విశేషమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.

అందువల్లనే ఈ రోజున *'ఉమామహేశ్వర వ్రతం'* ఆచరించాలని చెప్పబడుతోంది. ఉమా మహేశ్వరులను లోకానికి తల్లిదండ్రులుగా భావించి పూజించడం జరుగుతుంటుంది. పాపాలను నశింప జేసి .. పుణ్యలోకాలను ప్రసాదించేవాడు శివుడైతే , సంతాన సౌభాగ్యాలను అనుగ్రహించే అమ్మగా పార్వతీదేవి కనిపిస్తుంది. అలాంటి ఆది దంపతులను ఏ రోజున పూజించినా .. స్మరించినా ఆశించిన ఫలితాలు అందుతాయి. 

అయితే ముఖ్యంగా భాద్రపద పౌర్ణమి రోజున *ఉమామహేశ్వరులను వ్రత విధానం* ద్వారా పూజించడం వలన , ఆదిదంపతులు మరింత ప్రీతి చెందుతారని అంటారు. ఈ రోజున నియమ నిష్ఠలను పాటిస్తూ .. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉమా మహేశ్వరులను ఆరాధించడం వలన సకల సంపదలు ప్రాప్తిస్తాయనీ .. సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి...స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: